చిరంజీవి కూతురు తల్లి కాబోతోంది

  • IndiaGlitz, [Tuesday,November 06 2018]

మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కు ఆమె స్నేహితుడైన కళ్యాణ్ దేవ్ తోవివాహం జరిగిన విషయం తెలిసిందే. అతిరథ మహారథుల మధ్య ఈ పెళ్లి 2016 మార్చ్ 28న బెంగుళూరు లోనే మెగాస్టార్ ఫామ్ హౌస్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇటీవలే శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ 'విజేత' చిత్రంతో హీరోగా ఎంట్రీ కూడా ఇచ్చాడు కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.

అయితే తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తల్లి కాబోతోందన్న శుభవార్తని కళ్యాణ్ దేవ్ స్పష్టం చేశాడు. కళ్యాణ్ దేవ్, శ్రీజ లు నవ్వుతూ తన బేబీ బంప్ పై చేతులు పెట్టుకొని ఉన్న సెల్ఫీ ఫోటోని తీసి శ్రీజకళ్యాణ్ బేబీ2 #లోడింగ్.... అంటూ శ్రీజ తల్లి కాబోతున్న విషయాన్నీ ఎంతో సంతోషంతో ట్వీట్టర్ ద్వారా తెలియజేశాడు.

మొదట ప్రేమ వివాహం చేసుకొని నివ్రితి అనే బిడ్డకు జన్మనిచ్చిన శ్రీజ ఇప్పుడు మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. దింతో మెగా స్టార్ ఇంట్లో దీపావళి పండగ ముందుగానే పండగ వాతావరణం నెలకొంది.

More News

గుణశేఖర్ 'హిరణ్యకశిప' అప్ డేట్

దర్శకుడు గుణ శేఖర్ రానా అనుష్కలతో చేసిన 'రుద్రమదేవి' చిత్రం తర్వాత 'హిరణ్యకశిప' చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

బ్రేకింగ్ వివాదంలో షారుక్ ఖాన్ 'జీరో'

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తాజాగా నటించిన చిత్రం 'జీరో'.  ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం లో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో మెప్పించనున్నాడు.

అల్లు అర్జున్ కు కేరళ 'సి ఎం' ఆహ్వానం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సినిమా "నా పేరు సూర్య" విడుదలై ఇప్పటికే నాలుగు నెలలు కావస్తున్నా తన తదుపరి సినిమాను ఎవరితో  చేయనున్నాడనేది కన్ఫర్మ్ కాలేదు.

బోయపాటి రామ్ చరణ్ ల ఫస్ట్ లుక్ అదిరిందిగా

ఊర మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.