close
Choose your channels

బ్రేకింగ్ వివాదంలో షారుక్ ఖాన్ 'జీరో'

Tuesday, November 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్రేకింగ్ వివాదంలో షారుక్ ఖాన్ జీరో

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తాజాగా నటించిన చిత్రం 'జీరో'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం లో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో మెప్పించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. షారుక్ ఖాన్ సరసన ఈ చిత్రంలో హాట్ భామలు అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లు నటిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది.అయితే ఈ చిత్రంలో షారుక్ సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే కత్తిని ధరించాడు. అయితే ఈ కత్తిని సాంప్రదాయం ప్రకారం అమృత దారి అయినా సిక్కులు మాత్రమే ధరించాలని, అటువంటి పవిత్రమైన కత్తిని షారుక్ సినిమాలో ధరించి మమ్మల్ని ఆవమానించాడని, తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా చిత్రంలో పలు సన్నివేశాలు ఉన్నాయంటూ ఢిల్లీ సిక్కు గురుద్వార్ కమిటీ జనరల్ సెక్రటరీ ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేశారు.

ఇలా సిక్కులను అవమానించినందుకు షారుక్ ఖాన్ దర్శకుడు ఆనంద్ ల పై చర్యలు తీసుకోవాలని, అలాగే సినిమాలో సిక్కులను అవమానించేలా ఉన్న అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.