ఫేర్‌వెల్ చేసుకుంటామని , వార్డెన్ ఇంటికెళ్లగానే... హాస్టల్‌లో పదో తరగతి విద్యార్ధుల సిట్టింగ్

  • IndiaGlitz, [Thursday,April 21 2022]

సార్.. పరీక్షలు దగ్గర పడ్డాయి కదా.. ఫేర్ వెల్ పార్టీ చేసుకుంటాం సార్ అని పదోతరగతి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌ని కోరారు. పిల్లల కోరికను పెద్ద మనసుతో అర్ధం చేసుకున్న ఆయన.. చికెన్ కర్రీ చేయించి మరీ.. వాళ్లని సంతోష పెట్టారు. అయితే ఆ ఫేర్ వెల్ పార్టీలో.. మద్యం తగ్గిందని భావించిన విద్యార్ధులు.. బీర్ బాటిళ్లను తెప్పించి ఫుల్లుగా తాగేశారు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని బీసీ బాలుర హాస్టల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హాస్టల్లోని పదో తరగతి విద్యార్థులు, కింది తరగతి విద్యార్థులు కలిసి ఏప్రిల్ 17న రాత్రి వీడ్కోలు పార్టీ చేసుకుంటామని హాస్టల్ వార్డెన్ను పర్మిషన్ కోరారు. ఆయన వారి కోరికను మన్నించారు. అంతేకాకుండా హాస్టల్‌లోని వంటమనిషి చేత చికెన్ వండించారు. విద్యార్థులందరూ.. భోజనం చేసిన తర్వాత వార్డెన్ ఇంటికి వెళ్లిపోయారు. అయితే ముక్క వుంది.. చుక్క లేకపోతే ఎలా అనుకున్నారో ఏమో కానీ వార్డెన్ అటు వెళ్లగానే మందు పార్టీకి స్కెచ్ వేశారు పిల్లలు.

మిత్రులతో హాస్టల్ వెనుక నుంచి బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు. ఆ తర్వాత అందరూ సిట్టింగ్ వేసి చికెన్తో పాటు మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. అక్కడితో ఆగకుండా మందు తాగుతున్నప్పుడు ఫొటోలు తీసుకున్నారు. వీటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. దీంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. అంతే హాస్టల్లోని విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

More News

సీఎం కాన్వాయ్‌కి ప్రభుత్వ వాహనాలు లేవా... నేనేప్పుడూ చూడలేదు: ఒంగోలు ఘటనపై పవన్ ఆగ్రహం

ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం తిరుమలకు వెళ్తున్న ఓ కుటుంబం నుంచి కారు లాక్కున్న ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విజయ్ దేవరకొండ, సమంత చిత్రం ప్రారంభం

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా రూపొందిస్తున్నారు.

రేపు జగన్ టూర్.. కాన్వాయ్ కోసం కారు లాక్కెళ్లిన కానిస్టేబుల్, నడిరోడ్డుపై కుటుంబం

పలు నిర్ణయాలతో విమర్శలు మూట కట్టుకున్న ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది.

జీవో 111 ఆంక్షల ఎత్తివేత... ఫలించిన 26 ఏళ్ల నిరీక్షణ, 84 గ్రామాలకు విముక్తి

జీవో 111ను ఎత్తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని తపించేవారు : తాతినేని మరణంపై బాలయ్య దిగ్భ్రాంతి

సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.