Chandrababu, Prashant Kishore:షాక్‌లో సీఎం జగన్.. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ..

  • IndiaGlitz, [Saturday,December 23 2023]

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నారా లోకేశ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారు. అనంతరం ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ఉండవల్లికి వెళ్లారు. ఈ పరిణామం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం పనిచేసిన సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఉన్నట్లుండి టీడీపీతో టచ్‌లోకి వెళ్లడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన కూడా గతంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీంలో పనిచేశారు. తర్వాత సొంతంగా సంస్థ పెట్టుకుని టీడీపీ కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబుతో పీకేతో పాటు రాబిన్‌ కూడా పాల్గొనడం విశేషం.

గత కొంతకాంలగా వైసీపీకి ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని, పరిపాలన తీరు మార్చుకోవాలని పీకే ఇచ్చిన సూచనలను, హెచ్చరికలను సీఎం జగన్ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి వైసీపీలో అట్టిముట్టనట్లు ఉంటున్నారట. ఇటీవల వివిధ ఇంటర్వ్యూలలో ప్రశాంత్ మాట్లాడుతూ ఏపీలో చేసినట్లు విచ్చలవిడిగా అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందన్నారు. జగన్‌ కోసం పనిచేసి గెలిపించినందుకు ప్రజలు తనను ఇప్పుడు విమర్శిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచింది.

కొంతకాలంగా టీడీపీతో కలిసి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కనబరుస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రశాంత్ కిషోర్ విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె భారీ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయాల వైపు మొగ్గు చూపారు. తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో జనసురాజ్ పేరుతో రాజకీయ వేదిక ఏర్పాటుచేసి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు నేరుగా లోకేశ్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ రావడం.. చంద్రబాబుతో భేటీ కావడం వైసీపీ క్యాడర్‌ను షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి.

More News

రోజురోజుకు దిగజారుతున్న టీడీపీ.. సైబర్ నేరస్థుడికి వత్తాసు..

ఇంతకన్నా ఏం దిగజారుతుంది అనుకున్న ప్రతిసారీ మరింత దిగజారుతుంది తెలుగుదేశం పార్టీ. విదేశాల్లో ఉంటూ సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు, కుటుంబసభ్యులను

CM Revanth Reddy:ప్రజల వద్దకే పాలన.. మరో వినూత్న కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

తెలంగాణలో తనదైన పాలనతో దూసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

Undavalli: వైసీపీ ఎమ్మెల్యేల మార్పుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలు సమయం ఆసన్నం కావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే ఇంఛార్జ్‌ల మార్పుతో కదనరంగంలోకి దిగగా..

వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్లపై రాయితీ

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో శుభవార్త అందించింది. పెండింగ్ చలాన్ల(Pending Challans)పై మరోసారి రాయితీని ఇచ్చేందుకు పోలీసుశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Free Bus Travel: ఏపీలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. వైసీపీ ప్రభుత్వం కసరత్తు..

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇప్పుడు ఇదే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల అజెండాగా మారుతుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.