close
Choose your channels

Chandrababu, Prashant Kishore:షాక్‌లో సీఎం జగన్.. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ..

Saturday, December 23, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నారా లోకేశ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారు. అనంతరం ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ఉండవల్లికి వెళ్లారు. ఈ పరిణామం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం పనిచేసిన సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఉన్నట్లుండి టీడీపీతో టచ్‌లోకి వెళ్లడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన కూడా గతంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీంలో పనిచేశారు. తర్వాత సొంతంగా సంస్థ పెట్టుకుని టీడీపీ కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబుతో పీకేతో పాటు రాబిన్‌ కూడా పాల్గొనడం విశేషం.

గత కొంతకాంలగా వైసీపీకి ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని, పరిపాలన తీరు మార్చుకోవాలని పీకే ఇచ్చిన సూచనలను, హెచ్చరికలను సీఎం జగన్ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి వైసీపీలో అట్టిముట్టనట్లు ఉంటున్నారట. ఇటీవల వివిధ ఇంటర్వ్యూలలో ప్రశాంత్ మాట్లాడుతూ ఏపీలో చేసినట్లు విచ్చలవిడిగా అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందన్నారు. జగన్‌ కోసం పనిచేసి గెలిపించినందుకు ప్రజలు తనను ఇప్పుడు విమర్శిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచింది.

కొంతకాలంగా టీడీపీతో కలిసి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కనబరుస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రశాంత్ కిషోర్ విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె భారీ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయాల వైపు మొగ్గు చూపారు. తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో జనసురాజ్ పేరుతో రాజకీయ వేదిక ఏర్పాటుచేసి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు నేరుగా లోకేశ్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ రావడం.. చంద్రబాబుతో భేటీ కావడం వైసీపీ క్యాడర్‌ను షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.