close
Choose your channels

YS Jagan: ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం జగన్

Wednesday, March 13, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

YS Jagan: ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం జగన్

ఏపీలో ఎన్నికల సమరానికి సమయం సిద్ధమైంది. మరో రెండు రోజల్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార వైసీపీ కురుక్షేత్రానికి సిద్ధమైంది. ఈనెల 16న పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ఇడుపులపాయలో సీఎం జగన్ ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో ఇడుపులపాయ వేదికగానే అభ్యర్థులను ప్రకటించడంతో ఆ సెంటిమెంట్‌తో ఇప్పుడు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను వెల్లడించనున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లుగా నియమించిన వారినే అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యా్ప్ ఖరారు చేశారు.

YS Jagan: ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం జగన్

ఇదిలా ఉంటే ఇప్పటికే 12 జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా 12వ జాబితాలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా మంత్రి గుడివాడ అమర్మాథ్, చిలుకూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కావాటి మనోహర్ నాయుడుని నియమించింది. అలాగే గతంలో కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా బీవీ రామయ్యను నియమించడంతో ఆయన స్థానంలో కర్నూలు మేయర్‌గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ప్రకటించింది. ఇక శాసనమండలి విప్‌‌గా జంగా కృష్ణమూర్తి స్థానంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని నియామిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

YS Jagan: ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం జగన్

కాగా ఇప్పటివరకు విడుదలైన మొత్తం జాబితాలలో 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జీలను నియమించింది. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలడమే టార్గెట్‌గా పెట్టుకున్న పార్టీ చీఫ్ జగన్.. ఆ దిశగా బలమైన అభ్యర్థలను ఎంపికచేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించారు. టికెట్ రాని నేతలకు మళ్లీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పి్స్తామని హామీ ఇస్తున్నారు.

మరోవైపు గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేయనున్నారు. తదుపరి నంద్యాల జిల్లా బనగానపల్లిలో రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద నిధులు విడుదల చేయనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.