విలన్ గా మారుతున్న కమెడియన్ టర్నడ్ హీరో..!

  • IndiaGlitz, [Tuesday,October 04 2016]

విల‌న్ గా మారుతున్న క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో...ఎవ‌రో కాదు సునీల్. అవును..ఇది నిజంగా నిజం. ఈ విష‌యాన్ని ఈరోజు స్వ‌యంగా సునీల్ మీడియాకి తెలియ‌చేసారు. అస‌లు సునీల్ విల‌న్ అవుదామ‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడ‌ట‌. కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు కామెడీ వేషాలు, హీరో వేషాలే వేసాడు. ఇక ఇప్పుడు త‌న కోరికైన విల‌న్ వేషం వేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌. అయితే...విల‌న్ గా న‌టించేది మాత్రం తెలుగు సినిమాల్లో కాదు ప‌ర‌భాషా చిత్రాల్లో న‌టిస్తాను.
ఎందుకంటే...ఇక్క‌డ నేను వేసిన కామెడీ వేషాలు చూసి నన్ను విల‌న్ గా చూడ‌క‌పోవ‌చ్చు. అందుక‌ని వేరే భాష‌ల్లో విల‌న్ గా న‌టిస్తాను అని సునీల్ చెప్పారు. ఆల్రెడీ విల‌న్ గా న‌టించ‌మ‌ని ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌. అయితే....విల‌న్ గా ఏ భాష చిత్రంలో న‌టిస్తాను అనేది త్వ‌ర‌లో తెలియ‌చేస్తాను. వ‌చ్చే సంవ‌త్స‌రం మాత్రం విల‌న్ గా న‌టించ‌డం ఖాయం అని అంటున్నారు సునీల్. మ‌రి...క‌మెడియ‌న్ గా, క‌థానాయ‌కుడుగా రాణించిన సునీల్ ప్ర‌తి నాయ‌కుడుగా కూడా రాణిస్తాడేమో చూద్దాం..!

More News

చక్కనమ్మా చిక్కినా అందమే...

తెలుగు,తమిళంలో బబ్లీ బ్యూటీ హన్సిక వరుస సినిమాలతో బిజీగా ఉంది.

అక్టోబర్ 21 న రానున్న 'శంకర'

'అతను కాలేజీలో చదువుతున్న కుర్రాడు.ప్రశాంతంగా సాగుతున్న అతని జీవితంలోకి అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి.

రామ్ ముందడుగు వేశాడు...

ఎనర్జిటిక్ స్టార్ రామ్,రాశిఖన్నా జంటగా సంతోష్ శ్రీన్ వాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట,అనిల్ సుంకరలు నిర్మించిన చిత్రం హైపర్.

చైతుకు ఆ విషయం ప్లస్ కానుందా....?

అక్కినేని నాగచైతన్య,శృతిహాసన్,అనుపమ పరమేశ్వరన్,మడోనా కలయికలో కార్తికేయ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో

'బాహుబలి 2' యు.ఎస్ , కెనడా హక్కులు చేతులు మారాయి....

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా బాహుబలి2-ది కన్ క్లూజన్.