ప్రధాని మోదీపై పోటీ చేస్తానంటున్న కమెడియన్.. ఎందుకో తెలుసా..?

  • IndiaGlitz, [Thursday,May 02 2024]

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి సినీ, క్రీడా ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారు. మరోవైపు సామాన్యులు కూడా కీలక నేతలపై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శ్యామ్ రంగీలా(Shyam Rangeela) చేరాడు. ఏకంగా ప్రధాని మోదీపైనే వారణాసి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనంగా మారాడు. ముఖ్యంగా ప్రధానిపై బరిలోకి దిగడానికి ప్రత్యేక కారణం ఉందని శ్యామ్ రంగీలా తెలిపాడు.

లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత మీ అందరి నుంచి నాకు లభిస్తున్న ప్రేమను చూసి నేను సంతోషిస్తున్నాను. వారణాసి చేరుకున్న తర్వాత నా నామినేషన్, ఎన్నికల్లో పోటీ చేయడంపై నా అభిప్రాయాలను వీడియో ద్వారా త్వరలో మీకు తెలియజేస్తాన”ని పేర్కొన్నాడు. గతంలో మోదీకి మద్దతుగా ప్రచారం చేశానని కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2014లో ప్రధాని మోదీకి నేను ఫాలోయర్‌ని. ఆయనకు మద్దతుగా రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లకు వ్యతిరేకంగా కూడా వీడియోలు షేర్ చేశాను. ఆ వీడియోలు చూసినవారెవరైనా.. వచ్చే 70 ఏళ్లు బీజేపీ మాత్రమే నేను ఓటేస్తానమో అనుకుంటారు. కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి మారింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. సూరత్, ఇండోర్‌లా ఏకగ్రీవం కాకుండా.. వారణాసిలో ఓటు వేసే ప్రజలకు నేను మరో ఆప్షన్ అవుతాను. నేను ఈ వారం వారణాసికి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తాను వెల్లించాడు.

కాగా సూరత్‌ నియోజకవర్గంలో ముఖేష్ దలాల్.. ఇండోర్ నియోజకవర్గం నుంచి శంకర్ లాల్వానీ.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వీరిద్దరు బీజేపీకి చెందిన నేతలు కావడం గమనార్హం. అందుకే ప్రధాని ఎన్నికల కూడా ఏకగ్రీవం కాకుండా ఉండేందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు శ్యామ్ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధాని మోదీ వాయిస్‌ని మిమిక్రి చేసి శ్యామ్ పాపులర్ అవ్వడం విశేషం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇక వారణాసిలో చివరి విడతలో భాగంగా జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి.

More News

Sharmila: 'నవ సందేహాల' పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

సీఎం జగన్‌కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'నవ సందేహాల' పేరుతో మరో లేఖ రాశారు. బుధవారం ఎస్సీ, ఎస్టీల గురించి 9 ప్రశ్నలతో ఓ లేఖ రాయగా.. తాజా లేఖలో ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

Kavitha:లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బెయిల్ కోసం మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.

Pawan Kalyan: ఒక్క ఛాన్స్ అయిపోయింది.. జగన్‌ను ఇక ఇంటికి పంపడమే: పవన్

జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది.. ఇక ఇంటికి పంపడమే మిగిలింది అని జనసేన అధినేత వపన్ కల్యాణ్ తెలిపారు. ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురంలో బుధవారం నిర్వహించిన వారాహి

Committee Kurrollu:శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న 'కమిటీ కుర్రోళ్లు'

మెగా డాక్టర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’

Hari Hara Veera Mallu: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్‌. అదరగొడుతున్న 'హరిహర వీరమల్లు' టీజర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల సమయం కావడంతో