close
Choose your channels

రైతు కష్టాలు ఇవాళే కనిపించాయా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనం ఫైర్..

Tuesday, December 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేసినా తప్పే అవుతోంది. వరద బాధితుల పరామర్శకు వెళ్లినప్పుడు ఎక్కడికక్కడ ప్రజానీకం నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ... ఢిల్లీలో కొద్దిరోజులుగా జరుగుతున్న రైతుల ఆందోళనలకు సంఘీభావంగా మంగళవారం రైతులు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌ను విజయవంతం చేయటానికి రంగంలోకి దిగాయి.

ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారపక్షమైన టీఆర్‌ఎస్‌ కూడా భారత్‌ బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించటం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పిలుపునివ్వటం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఎక్కడా బంద్‌లో పాల్గొనటం లేదు కానీ ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం రోడ్డెక్కారు. కాగా.. నేటి బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై జనం తిరగపడ్డారు. ఉష ముళ్లపూడి కామన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని ప్రజలు ఆందోళనకు దిగారు.

బంద్ 11 గంటల నుంచి అయితే ఇలా పొద్దుటే వచ్చి తమను కార్యాలయాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడమేంటని ఓ సామాన్యుడు ఫైర్ అయ్యాడు. అంతే ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో సదరు వ్యక్తిపై తమ బలాన్ని ప్రదర్శించారు.అంతే ఆ వ్యక్తి వెళ్లి కొంతదూరంలో పడిపోయాడు. దీంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. వారిలో ఓ మహిళ ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు.. ఇప్పుడే కనిపించాయా? అంటూ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. తమకు ఇబ్బందులకు గురి చేసి బారికేడ్లు పెట్టడం ఏంటని మండిపడింది. మరోవైపు జీహెచ్ఎంసీ ఫలితాల కారణంగానే టీఆర్ఎస్ బంద్‌కు మద్దతు తెలియజేస్తోందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.