కృష్ణ.. కృష్ణా.. సీతతో పోలికేంటి స్వామీ..!

  • IndiaGlitz, [Wednesday,January 16 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి సోదరి షర్మిళ.. తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు గుర్రుమంటుండగా.. వైసీపీ నేతలు, పలువురు ప్రముఖులు షర్మిళకు మద్దతుగా నిలుస్తున్నారు.

అయితే ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ మరో అడుగు ముందుకేసి వైఎస్ షర్మిళను సీతతో పోల్చారు. షర్మిళను 'కలియుగ సీత'తో.. ఆమెపై దుష్ప్రచారం చేస్తున్న వారిని దగుల్బాజీ, గజ్జి కుక్కలతో పోల్చారాయన. ఆడపడుచుకు అన్నగా.. మద్దతిచ్చి అండగా నిలవడంలో ఎలాంటి తప్పులేదు.. మద్దతివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మధ్యలో ‘కలియుగ సీత’ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడటంతో నెట్టింట్లో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి.

టీడీపీకి ఓటమి భయం.. వైసీపీ విజయం ఖాయం!

ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. సౌత్‌ ఇండియా సినీ ఇండస్ట్రీ మొత్తం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ 'ప్రజా సంకల్పయాత్ర' గురించే మాట్లాడుతోంది. ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత వైఎస్సార్‌ కుటుంబానిదే. వైఎస్‌ షర్మిలపై ఆరోపణలు చేయడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా?. ఆడపడుచుపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాను. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పరిపాలన అన్నదే లేదు.. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులో లేరు అని చిన్ని కృష్ణ చెప్పుకొచ్చారు.

More News

'F2' లో శ్రీరెడ్డి డైలాగ్‌‌.. ప్రేక్షకులంతా ఫసక్!

సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుళ్లు ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌‌తో సినిమాకెళ్లిన సినీ ప్రియులు, అభిమానులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.

లీక్స్ కాకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న జగన్

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ పూర్తిగా ఎలక్షన్ మూడ్‌లో పడిపోయాయి.

టికెట్ ఇచ్చేది లేదని మంత్రికి తేల్చిచెప్పిన చంద్రబాబు

ఇప్పటికే ఆమెకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా అదే ఫ్యామిలీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సోదరుడికి టికెట్ ఇచ్చి దగ్గరుండి చంద్రబాబు గెలిపించారు.

కూల్ బ్రో చిల్.. అంటున్న మంత్రి నారా లోకేశ్!

టైటిల్ చూడగానే జబర్దస్త్ యోధా.. 'చిల్ బేబీ.. సెల్ఫీ' అనే డైలాగ్ గుర్తొచ్చింది కదూ.. అవును అది యోధా రీల్ డైలాగ్ అయితే.. మంత్రి నారా లోకేశ్ మాత్రం రియల్ లైఫ్‌‌లో 'కూల్ బ్రో చిల్' అంటున్నారు.!

గాడిద పాలతో చేసిన సబ్బు కోసం జనం పోటెత్తారు

'గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు' అని వేమన చెప్పిన పద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ పద్యం ఇప్పుడు రివర్స్‌లో చదువుకోవాల్సిన రోజులొచ్చాయి.