కేసీఆర్ ఫాంహౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణమిదేనా!

  • IndiaGlitz, [Wednesday,October 16 2019]

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే.. కేసీఆర్ ఫాంహౌస్‌లో వెంకటేశ్వర్లు అనే హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తుండేవారు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ బుధవారం నాడు తన దగ్గరున్న ఏకే 47 గన్‌తో కాల్చుకొని ప్రాణాలు వదిలాడు. ఈయన 12వ బెటాలియన్‌కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. నల్గొండ జిల్లా వాసి అయిన వెంకటేశ్వర్లు.. ఉన్నతాధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న సమయంలో మద్యంమత్తులో ఉన్నాడని తెలిపారు. గతకొంతకాలంగా అతను విధులకు సరిగా హాజరు కావడం లేదని సీపీ తెలిపారు. అయితే.. భార్య విజ్ఞప్తితో తిరిగి విధుల్లో వెంకటేశ్వర్లను చేర్పించుకున్నామని.. ఆయన మీడియాకు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్!

ఇదేంటి.. కొంపదీసి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తలొగ్గి వారి డిమాండ్లను నెరవేరుస్తున్నారా ఏంటి..?

హేమమాలిని బుగ్గల్లా రోడ్లు తయారుచేస్తా!!

అవును మీరు వింటున్నది నిజమే.. పై మాట అన్నది ఓ స్టేట్ మినిస్టర్.. డ్రీమ్‌గాళ్ అంటే అమితంగా అభిమానించే ఆ మంత్రి ఆమె బుగ్గలను రోడ్లతో పోలుస్తూ..

అక్టోబర్ 18న 'సరోవరం'రిలీజ్

శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దయచేసి నటించడం ఆపోద్దమ్మా రాములమ్మా..!

ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత అలనాటి సీనియర్ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

ఎగ్జిట్ పోల్స్ నిషేధించిన ఎన్నికల కమిషన్

ఈ నెల 21న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.