ఏపీలో షాకిచ్చిన కరోనా.. నేడొక్కరోజే 10 వేలకు పైగా కేసులు..

  • IndiaGlitz, [Wednesday,July 29 2020]

ఏపీలో కరోనా షాకిస్తోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాకూడా కరోనా విజృంభణ మాత్రం ఆగట్లేదు. ఏపీ కరోనా హెల్త్ బులిటెన్‌ను బుధవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 70,584 శాంపిళ్లను పరీక్షించగా 10,093 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 120390కు చేరుకుంది. కాగా నేడు ఒక్కరోజే 2784 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 55406కు చేరుకుంది.

అయితే ప్రస్తుతం ఏపీలో 63771 యాక్టివ్ కేసులున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా నేడు కరోనాతో 65 మంది మృతి చెందారు. తూర్పు గోదావరిలో 14 మంది, అనంతపూర్‌లో 8 మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలు, నెల్లూరు‌ల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా, ప్రకాశంలలో నలుగురు చొప్పున, గుంటూరు, కడపలలో ముగ్గురు చొప్పున.. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 18,20,009 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

స్టూడియో నిర్మాణానికి సుధీర్ ఆస‌క్తి!!

‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సుధీర్ బాబు కొన్ని చిత్రాల్లో చిన్నా చిత‌కా పాత్ర‌ల‌తో పాటు ‘భాగి’ వంటి చిత్రంలో

నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫిక్స్‌

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి ఈ ఏడాదిలో జ‌ర‌నున్న సంగ‌తి తెలిసిందే.

శివాజీ రాజా తనయుడు విజయ్ రాజు నూతన చిత్రం ప్రారంభం

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో

ఆర్జీవీకి షాక్‌!!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఆర్జీవీ లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

అయోధ్యలో హై అలెర్ట్.. ఉగ్రదాడికి కుట్ర!

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్ట్ 5న భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఇటుకను ప్రధాని మోదీ అందించనున్నారు.