దేశంలో 44 రోజుల కనిష్టానికి కరోనా కేసులు

దేశంలో భయాందోళనలు కలిగిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్నీ మధ్య వరకూ 4 లక్షల పై చిలుకు నమోదైన కేసులు.. ఈ మధ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక గురువారం అయితే ఏకంగా 44 రోజుల కనిష్టానికి కరోనా కేసులు చేరుకోవడం విశేషం. మరణాలు సైతం రెండు రోజులుగా కాస్త అదుపులోకి వచ్చాయి. నాలుగు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. అలాగే యాక్టవ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. రికవరీ రేటు పెరుగుతోంది.

ఇదీ చదవండి: ఉల్లిపాయ, ఫ్రిడ్జ్ బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతాయా?

తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గురువారం 20,70,508 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,86,364 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 44 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 13న 1,84,372 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రోజువారీ కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.75 కోట్లు దాటింది. కాగా.. గడిచిన 24 గంటల్లో 3,660 మంది మరణించారు.

ఇప్పటి వరకూ మొత్తంగా కరోనాతో 3,18,895 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.15 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 23,43,152 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 8.84 శాతానికి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 2,59,459 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 2.48 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 90.01 శాతానికి చేరుకుంది. కాగా.. వరుసగా 15వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

More News

బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఫిక్స్!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి రంగం కూడా సిద్ధమైనట్టు సమాచారం. దీనికి ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది.

రాజమౌళి తండ్రి ఫోన్ లో పూరి ఫోటో.. షాకింగ్ రీజన్, నీ రేంజ్ ఇది అంటూ కొరటాల..

టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు ప్రత్యేక స్థానం ఉంది. పూరి శైలిని ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. పూరి ఇండస్ట్రీలో నిర్మాతల దర్శకుడు అనే మంచి పేరు ఉంది.

ఉల్లిపాయ, ఫ్రిడ్జ్ బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతాయా?

కరోనా మహమ్మారి కారణంగా అల్లాడుతున్న జనంపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. క్రమక్రమంగా బ్లాక్ ఫంగస్ మరణాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. మరణాలతో పాటు అపోహలు సైతం పెరుగుతూ వస్తున్నాయి.

సిద్దిపేటలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూసూద్ సిద్ధం.. అయితే..

కరోనా సెకండ్ వేవ్ ఎన్ని కుటుంబాలను తుడిచిపెట్టేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత కారణంగానే చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి.. రూ.2 లక్షల జరిమానా..

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా