క‌రోనా దెబ్బ‌..వాయిదా వేసుకున్న నాగ్‌!

  • IndiaGlitz, [Thursday,February 06 2020]

ప్ర‌పంచం అంతా క‌రోనా ఎఫెక్ట్‌తో భ‌య‌ప‌డుతుంది. ఈ ఎఫెక్ట్ కార‌ణంగా ప్ర‌జ‌లు వేరే ప్ర‌దేశాల‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారు. సినీ రంగం విష‌యానికి వ‌స్తే ..అలా క‌రోనా ఎఫెక్ట్‌తో భ‌య‌ప‌డ్డ వైల్డ్ డాగ్ యూనిట్ ఓ నిర్ణ‌యం తీసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. నాగార్జున హీరోగా సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'వైల్డ్ డాగ్‌'. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను థాయ్‌లాండ్‌లో చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా షెడ్యూల్‌ను వాయిదా వేసిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి స్పంద‌న లేదు.

మ‌న్మ‌థుడు 2 త‌ర్వాత నాగార్జున చేస్తున్న చిత్ర‌మిది. రొటీన్‌కు భిన్నంగా నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగ్‌..ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా..ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా న‌టిస్తున్నారు. అలాగే హీరోయిన్ స‌యామీఖేర్ కూడా ఇందులో యాక్ష‌న్ రోల్‌లో న‌టిస్తుంది. స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంద‌ని టాక్‌. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

పవన్ హీరోయిన్ ఖ‌రారు.. ఈసారి హిట్ కొడతాడా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.

డిప్యూటీ సీఎంగా కేటీఆర్.. మంత్రిగా ఐపీఎస్!?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా..? ఆయనతో పాటు ఐపీఎస్ అధికారి కేసీఆర్ మంత్రి వర్గంలోకి రానున్నారా..? అంటే

టీడీపీకి ‘కళ’ తప్పింది.. ‘అచ్చెన్న’తో అచ్చొస్తుందా!

తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు మారబోతున్నారా..? 2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారా..?

జాను నా కెరీర్‌లోనే స్పెష‌ల్ మూవీ.... మ‌ళ్లీ మేజిక్ రీ క్రియేట్ అయ్యింది : స‌మంత అక్కినేని

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో

RRR రిలీజ్ డేట్ చెప్పేసిన రాజమౌళి..

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’.