ఏపీలో తగ్గని కరోనా ఉధృతి.. 2వేలకు చేరువలో కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అయితే కేసులు సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ (గడిచిన 24గంటల్లో) కొత్తగా 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మీడియాకు రిలీజ్ చేసిన బులెటిన్‌లో ప్రభుత్వం ప్రకటిచింది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1930కు చేరుకుంది. అంటే రెండువేలకు చేరువలో కేసులు ఉన్నాయన్నమాట. అయితే గత వారంలో నమోదైన కేసులతో పోలిస్తే ఈ వారం మాత్రం చాలా మేలేనని చెప్పుకోవచ్చు. ఇందుకు కారణం ఇదివరకూ 6 వేల మందిని టెస్ట్ చేస్తే... 60 కేసుల దాకా వచ్చేవి. ఇప్పుడు మాత్రం 40 కేసులే నమోదవుతున్నాయి. అంటే ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లుగానే అనిపిస్తోంది.

ఇవాళ నమోదైన కేసుల లెక్కలు చూస్తే..

గత 24 గంటల్లో 8388 మందిని కరోనా పరీక్షలు చేయగా 43 మందికి పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవాళ కొత్తగా కృష్ణా జిల్లాలో 16, చిత్తూరు 11, కర్నూలు 6, గుంటూరు 2, విశాఖ 5, అనంతపురం 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రభుత్వం 887 డిశ్చార్జి చేసింది. 44 మంది చనిపోయారు. ఫలితంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 999గా ఉంది.

జిల్లాల వారీగా లెక్కలు చూస్తే..

రాష్ట్ర వాప్తంగా జిల్లాలో నమోదైన కేసుల లెక్కలను చూద్దాం.
అనంతపురం : 102
చిత్తూరు : 96
తూర్పు గోదావరి : 46
గుంటూరు : 376
కడప : 96
కృష్ణా : 338
కర్నూలు : 553
నెల్లూరు : 96
ప్రకాశం : 61
శ్రీకాకుళం : 05
విశాఖపట్నం : 62
విజయనగరం : 04
పశ్చిమ గోదావరి : 68

మొత్తం కేసులు : 1930
యాక్టివ్ కేసులు : 999
డిశ్చార్జ్ కేసులు : 887
మరణాలు : 44 అని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

More News

కోలీవుడ్‌ నటులకు ఏమైంది.. ఈ వివాదాలేంటి!?

కోలీవుడ్ నటులు వివాదాల్లో మునిగి తేలుతున్నారు. వివాదాలంటే దూరంగా ఉండే నటులు సైతం అదెలా ఉంటుందో చూడాలని ఇలా చేస్తున్నారేమో కానీ ఇటు మీడియాలో..

పాన్ ఇండియా మూవీ ‘83’కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపిన క‌బీర్‌ఖాన్‌

ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా అవ‌త‌రించింది. క‌పిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజ‌యంతో చాలా మందికి క్రికెట్

కోలీవుడ్‌కు గ్రీన్ సిగ్నల్.. టాలీవుడ్‌కు ఎప్పుడో..!?

తమిళ చిత్ర సీమకు పళనిస్వామి సర్కార్ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు

ఎన్టీఆర్‌ పుట్టిన రోజున స్టార్ డైరెక్టర్ సడన్ సర్‌ఫ్రైజ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు పేరుమోసిన.. హిట్ చిత్రాల దర్శకులతో సినిమాలు చేసిన

విశాఖ ఎల్జీపాలిమర్ వద్ద ఉద్రిక్తత.. సీఎం జగన్ రావాలని డిమాండ్

విశాఖపట్నంలోని ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఇటీవల జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది చెందగా.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.