close
Choose your channels

ఎన్టీఆర్‌ పుట్టిన రోజున స్టార్ డైరెక్టర్ సడన్ సర్‌ఫ్రైజ్!

Saturday, May 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్‌ పుట్టిన రోజున స్టార్ డైరెక్టర్ సడన్ సర్‌ఫ్రైజ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు పేరుమోసిన.. హిట్ చిత్రాల దర్శకులతో సినిమాలు చేసిన ఎన్టీఆర్ కోసం ‘కేజీఎఫ్’ చిత్రంతో తన రేంజ్‌ ఏంటో యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన ప్రశాంత్ వేయికళ్లతో వేచి చూస్తున్నాడట. వాస్తవానికి ‘కేజీఎఫ్’ సినిమా అయ్యాక ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించాలని ఆయన అనుకున్నప్పటికీ కుదర్లేదట. అందుకే యంగ్ టైగర్ పుట్టిన రోజున అభిమానులకు సడన్ సర్‌ఫ్రైజ్ ఇవ్వడానికి ప్రశాంత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్‌ఫ్రైజ్ సిద్ధమైందని మే 20న కీలక ప్రకటన ఉంటుందని తెలియవచ్చింది.

నలుగుర్ని చూసి..

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కొమ్రుం భీమ్‌గా నటిస్తున్నాడు. ఆ తర్వాత చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వస్తుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో జూనియర్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి ఎప్పట్నుంచో తెలుగులో పాగా వేయడానికి స్టార్ హీరోల కోసం ప్రశాంత్ వేట సాగిస్తూ వస్తున్నాడు. ఆయన కంట్లో మాత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అవకాశం చూసుకుని తెలుగులోకి ప్రశాంత్ ఎంట్రీ ఇస్తారని ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇదే నిజమైతే..

అయితే తాజాగా.. ఎన్టీఆర్‌తోనే ప్రశాంత్ సినిమా ఫిక్స్ అయిపోయిందని ఇప్పటికే ఇరువురి మధ్య ఫోన్‌లోనే స్టోరీ లైన్ కూడా డిస్కస్ చేశారని తెలియవచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ పుట్టిన రోజున సర్‌ఫ్రైజ్ ఇవ్వాలని ప్రశాంత్ భావిస్తున్నాడట. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే జూనియర్ బర్త్ డే వరకు వేచి చూడక తప్పదు. సినిమా కూడా 150 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ అని తెలిసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా సాగే ఈ కథలో యంగ్ టైగర్ అదిరిపోయే మాస్ లుక్‌లో కనిపిస్తాడట. కాగా.. ఇటీవలే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ నిర్మాత సంజయ్ లీలా బన్సాలీతో సినిమా ఉంటుందని పుకార్లు షికార్లు చేశాయి. ఇది కూడా జూనియర్ పుట్టిన రోజునే ఫస్ట్ లుక్ ఉంటుందని వార్తలు వినిపించాయి. అటు బాలీవుడ్ డైరెక్టర్.. ఇటు కన్నడ డైరెక్టర్‌తో సినిమాలు నిజమైతే మాత్రం ఎన్టీఆర్ రేంజ్‌ను ఇక ఊహించలేమేమో..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.