టీటీడీలో 140 మంది కరోనా.. బదిలీ కోరుతున్న అర్చకులు

  • IndiaGlitz, [Thursday,July 16 2020]

తిరుమల తిరుపతి దేవస్థానంలో 140 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభించిన తరువాతే ఈ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. పోలీసులు, అర్చకులు, పోటు కార్మికులకు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ వచ్చిందన్నారు. 70 మంది ఉద్యోగులు ఇప్పటికే కోలుకున్నారన్నారు.

బ్రహ్మోత్సవాలు నిర్వహణపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం

కాగా.. శ్రీవారి ఆలయంలో ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనాల కన్నా పూజా కైంకర్యాలు నిర్వహించడానికే ప్రాధాన్యత కాబట్టి అర్చకులతో చర్చించామన్నారు. తమకు వసతితో పాటు భోజన సౌకర్యం కల్పించాలని అర్చకులు కోరారని... అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి ఆలయంలో దర్శనాలు సంఖ్య పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

మాకు బదిలీ సౌకర్యం కల్పించండి: టీటీడీ అర్చకులు

కరోనా వైరస్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ ఎలా వ్యాపించిందో తెలియడం లేదని తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు చెబుతున్నారు. అయితే భక్తుల వలన తమకు ఎలాంటి ఇబ్బందులూ లేవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. క్యూలైన్‌కు సమీపంలో అర్చకులెవరూ విధులు నిర్వహించడం లేదన్నారు. నేడు అర్చక బృందమంతా టీటీడీ చైర్మన్‌ను కలిసింది. తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బదిలీ సౌకర్యం కల్పించాలని కోరింది.

More News

కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బిషప్ ఫ్రాంక్‌కు కరోనా..

బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇండియాలో 10 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌కు యాక్సిడెంట్.. కేర్‌కు తరలింపు

లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ తగ్గాయి. ఇటీవల సడలింపులివ్వడంతో ప్రమాదాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

చిరు 153 డైరెక్టర్ మారుతున్నాడా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’చిత్రీకరణను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు.

డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ చేతుల మీదుగా 'సెబాస్టియ‌న్ P.C. 524' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

రాజావారు రాణిగారు" చిత్రంతో చిత్ర సీమ‌కు ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క‌మిట్ అవుతూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు