అమెరికాలో పులికి కరోనా.. భారత్‌లో హై అలెర్ట్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మనుషులనే కాదు.. జంతువులనూ వదలట్లేదు. ప్రపంచంలో ఫస్ట్ టైమ్ ఈ మహమ్మారి నాలుగేళ్ల పులికి సోకింది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల పులి నాడియాకు జూపార్క్ ఉద్యోగి నుంచి వైరస్ సోకినట్టు తెలిపారు. ఆయన ద్వారా జూలోని జంతువులకు వైరస్ సోకిందని జూపార్క్ డైరెక్టర్ జిమ్ బ్రెహేనీ మీడియాకు వెల్లడించారు. ఆ నాలుగేళ్ల పులితో పాటు.. ఇదే జూలో ఉన్న మరో ఆరు పులులు, సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. అన్నింటికీ వైద్య పరీక్షలు నిర్వహించామని.. ప్రస్తుతం పులి కోటుకుంటోందని.. ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు గత నెల 16న జూను మూసివేశారు.

భారత్‌లో హై అలెర్ట్

ఇదిలా ఉంటే.. అమెరికాలో పులికి కరోనా సోకడంతో భారత్‌లోని అన్ని జూ పార్క్‌లలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్ సీసీ) నేతృత్వంలోని సెంట్రల్ జూ అథారిటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ‘జూ’లలో హై అలర్ట్‌తో వ్యవహరించాలని, అందులోని జంతువులను సీసీటీవీల ద్వారా నిరంతరం గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. వింత ప్రవర్తన లేదా లక్షణాలు కనబరిచే వాటిని, అనారోగ్యంగా ఉన్న వాటిని ఐసోలేట్ చేయడం లేదా క్వారంటైన్‌లో ఉంచడం చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

More News

ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డికి మాతృ వియోగం

టాలీవుడ్ ప్రముఖ ద‌ర్శక నిర్మాత తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమ్మారెడ్డి మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమ‌వారం కన్నుమూశారు.

రాజీవ్ కనకాల ఇంట విషాదం.. కేన్సర్‌తో సోదరి కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల ఇంట మరో విషాదం నెలకొంది. రాజీవ్ సోదరి, ప్రముఖ టీవీ నటి శ్రీలక్ష్మి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

పీఎం సహాయ నిధికి కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు పేర్కొన్నారు.

9 pm 9 మినిట్స్‌... వ‌ర్మ స్టైలే వేరు

ప్ర‌స్తుతం దేశం క్లిష్ట‌ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. క‌రోనా వైర‌స్‌ను పార‌ద్రోల‌డానికి దేశం యావ‌త్తు శ‌క్తి వంచ‌న లేకుండా పోరాడుతుంది. సామాజిక దూరాన్ని

సినీ కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న అమితాబ్‌

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు? క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇంటికే ప‌రిమిత‌మై ఉన్నారు. ఆయ‌నే బాలీవుడ్ స‌హా ఎంటైర్ ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీది