15 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. ఒక్కరోజే 654 మంది మృతి

  • IndiaGlitz, [Tuesday,July 28 2020]

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా ప్రతి రోజూ దాదాపు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో కేసులు 15 లక్షలకు చేరువవుతుండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 47,703 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,83,156కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,96,988 యాక్టివ్ కేసులున్నాయి. 9,52,743 మంది కరోనా నుంచి కోలుకుని చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 654 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 33,425కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు..

ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను

డిజిట‌ల్ మాధ్య‌మంలోకి కొర‌టాల‌?

నేటి త‌రం స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన కొర‌టాల శివ ట్రెండ్‌ను ఫాలో అవుతూ డిజిట‌ల్ మీడియంలోకి అడుగు పెట్ట‌బోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో

మ‌రో రెండు ప్లాన్ చేస్తున్న మెగా త‌న‌య‌!!

మెగాస్టార్ చిరంజీవి కుంటుంబంలో ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతగా మారి వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్.. ఇంకా ఆసుపత్రిలోనే అమితాబ్, అభిషేక్..

పది రోజుల కిందట ఓ న్యూస్ బాలీవుడ్‌ను షేక్ చేసింది. అది బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం.

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్..

కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న హైకోర్టు..