జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌... ద‌ర్శ‌కుల‌కు కోర్టు నోటీసులు

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణాంత‌రం .. ఆమెపై రెండు, మూడు బ‌యోపిక్స్‌ను ద‌ర్శక నిర్మాతు అనౌన్స్ చేశారు. వీటిలో రెండు భారీ చిత్రాలున్నాయి. అందులో ఒక‌టి ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి నిర్మిస్తున్న'త‌లైవి'. ఇందులో బాలీవుడ్ తార కంగ‌నా రనౌత్ జ‌య‌లలిత‌గా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పై కి వెళ్ల‌నుంది. కాగా చిత్రం ప్రియ‌ద‌ర్శిని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది.

'ది ఐర‌న్ లేడీ' పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో నిత్యామీన‌న్ జ‌య‌ల‌లితగా న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అంతా బాగానే ఉంది అనుకున్నారు. కానీ అస‌లు పేచీ ఇప్పుడే మొద‌లైంది. జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప.. జ‌య‌ల‌లిత బ‌యోపిక్స్‌పై త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డ‌మే కాక‌.. ఈ బ‌యోపిక్స్ కార‌ణంగా త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌కు భంగం వాటిల్లుతుంద‌ని పేర్కొన్నారు. త‌మ కుటుంబ స‌భ్యుల‌ అనుమ‌తి లేకుండా జ‌య‌ల‌లిత బ‌యోపిక్స్ ఎలా చేస్తారు? అంటూ కోర్టులో కేసు వేశారు. దీనిపై ఇద్ద‌రి దర్శ‌కుల‌తో పాటు జ‌య‌లలిత బ‌యోపిక్‌ను వెబ్‌సిరీస్‌గా తెర‌కెక్కించిన గౌత‌మ్ మీన‌న్‌కు మ‌ద్రాసు హైకోర్టు నోటీసుల‌ను జారీ చేసింది. మ‌రిప్పుడు చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ వ్య‌వ‌హారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

మహేష్ బాబుకు బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.

‘కలాం’ స్థానంలో ‘వైఎస్’ పేరు.. సీఎం జగన్ సీరియస్!

మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత డా. అబ్దుల్ కలాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోర అవమానం చేసిందని గత కొన్ని గంటలుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

వి. వి. వినాయక్ చేతులు మీదుగా 'రాజా నరసింహ' ట్రైలర్ ఆవిష్కరణ

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా అనువాదమవుతోంది.

అజర్‌బైజాన్‌లో '90 ఎంఎల్‌' పాటల చిత్రీకరణ పూర్తి...

'ఆర్‌ఎక్స్100' ఫేమ్‌ కార్తికేయ నటిస్తోన్న మరో విభిన్న చిత్రం '90 ఎం.ఎల్‌'. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు.

ప‌వ‌న్ కోసం సిద్ధమవుతోన్న సెట్

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.