close
Choose your channels

ఆర్జీవీ ‘మ‌ర్డ‌ర్‌’పై నిర్మాత‌ల‌కు కోర్టు నోటీసులు

Tuesday, August 4, 2020 • తెలుగు Comments

ఆర్జీవీ ‘మ‌ర్డ‌ర్‌’పై నిర్మాత‌ల‌కు కోర్టు నోటీసులు

వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌(ఆర్జీవీ) రూపొందిస్తోన్న చిత్రం ‘మ‌ర్డ‌ర్‌’. మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య ఆధారంగా వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. త‌న‌కు తెలిసిన, ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన విష‌యాల‌ను ఆధారంగా చేసుకుని ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్నానని వర్మ రీసెంట్ ఇంటర్వ్యూల్లో తెలియజేసిన సంగతి తెలిసిందే. మిర్యాల‌గూడ ప్ర‌ణ‌య్ హ‌త్య కేసు ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు అమృత‌, ప్ర‌ణ‌య్ తండ్రి బాలాస్వామి కోర్టుల్లో కేసు వేశారు. ఇది వ‌ర‌కే ప్ర‌ణ‌య్ తండ్రి బాలాస్వామి ఎస్సీ, ఎస్టీ కోర్టులో కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ప్ర‌ణ‌య్ భార్య అమృత న‌ల్గొండ డిస్ట్రిక్ కోర్టులో కేసు వేసింది.

సినిమా విడుద‌ల‌ను ఆపాల‌ని, ప‌బ్లిసిటీ ఆపాలంటూ అమృత కోర్టులో కేసు వేసింది. ఆ మేరకు ఈ నెల 6న కోర్టులో హాజరు కావాల్సిందిగా నిర్మాతలకు న‌ల్గొండ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టును గౌరవిస్తూ... కోర్టులోనే తేల్చుకుంటామని నిర్మాతలు స్పష్టం చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ సినిమాలో బ్యాంగ్రౌండ్ సాంగ్‌ను ఆర్జీవీ విడుద‌ల చేశారు. ఈనెల‌లో సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెన్సార్‌కు అప్ల‌య్ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz