కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌కూ సంబంధం లేదు: కుటుంబ సభ్యులు

  • IndiaGlitz, [Thursday,August 13 2020]

దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ కారు.. మరొక కారును ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో అవతలి కారు బాగా డ్యామేజ్ అయిందని మీడియాలో ప్రచారం జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్‌లు కూడా ఉన్నాయని మీడియా పేర్కొంది. ఈ న్యూస్ కాస్తా బాగా వైరల్ అవడంతో దీనిపై దగ్గుబాటి కుటుంబం స్పందించింది. అవన్నీ వదంతులేనని.. దయచేసి అటువంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని ప్రచారం చేసింది.

అసలు మీడియాలో వచ్చిన విషయం ఏంటంటే.. కరీంనగర్‌ జిల్లా ఆరేపల్లికి చెందిన రాజు అనే వ్యక్తి హైదరాబాద్ మణికొండలో బ్రీజా కారును కొనుగోలు చేశాడు. టెస్ట్ డ్రైవ్ కోసం స్నేహితుడితో కలిసి రాజు పంచవటి కాలనీలోని మల్లెమాల ప్రొడక్షన్‌ హౌస్‌ వైపు వెళ్లాడు. అదే సమయంలో అటుగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ కారు వచ్చింది. ఇరువురి కార్లూ పరస్పరం ఢీకొన్నాయి. ఇరువురూ రాంగ్ రూట్‌లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అభిరామ్ కారు కంటే అవతలి వ్యక్తి కారు బాగా డ్యామేజ్ అయ్యాయని మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే కారు ప్ర‌మాదానికీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేదని.. అది ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని కుటుంబ సభ్యులు స్ప‌ష్టం చేశారు. మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని.. అభిరామ్ కుటుంబ‌స‌భ్యులు స్పష్టం చేశారు. అది కేవ‌లం వ‌దంతి మాత్ర‌మేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు వెల్లడించారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని అభిరామ్ కుటుంబ సభ్యులు కోరారు.

More News

నాని.. చివ‌ర‌కు త‌ప్ప‌ేలాలేదు...!!

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం.. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ ఆగిపోవ‌డం ఏక కాలంలో జ‌రిగాయి.

పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తమన్..

కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమలో సినీ పరివ్రమ ఒకటి. దీనిపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు.

తెలంగాణలో తాజాగా 1931 కేసులు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దాదాపు 2000 దాకా కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి.

నా తండ్రి జీవించే ఉన్నారు: ప్రణబ్ కుమారుడు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరమపదించారంటూ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లికి హాజరైన పలువురికి కరోనా!

కరోనా వివాహ వేడుకలను సైతం వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ దాని పని అది చేసుకుపోతోంది.