కామ్రేడ్ పోరాడితే ఆ పోరాటం హాయినివ్వాలి, కానీ...

  • IndiaGlitz, [Thursday,July 11 2019]

'ఒక కామ్రేడ్ చేసే పోరాటం అత‌నికి హాయినివ్వాలి, స్వేచ్ఛ‌నివ్వాలి. కానీ నిన్ను చూస్తే అలా లేవు'
'వ‌చ్చేట‌ప్పుడు ఎంతో హాయిగా ఉండే ఈ ప్రేమ వెళ్లిపోయేట‌ప్పుడు ఎందుకింత బాధ‌పెడుతుంది'

అనే డైలాగ్స్‌తో డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. బాబీ అనే కాలేజ్ స్టూడెంట్ లీడ‌ర్‌ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తే.. క్రికెట‌ర్ కావాల‌నుకునే లిల్లీ పాత్ర‌లో ర‌ష్మిక న‌టించింది. హీరోయిన్‌ను డ్రీమ్ కోసం ఫైట్ చేయ‌మ‌ని చెప్పే హీరో ఆమెను ఎంక‌రేజ్ చేస్తుంటాడు.. కాబ‌ట్టి అదే ట్యాగ్‌లైన్‌గా 'ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌' అని పెట్టార‌ని అర్థమ‌వుతుంది.

ఈ డైలాగ్స్ హీరోలో రెవ‌ల్యూష‌న్‌ను ఆవిష్క‌రిస్తూనే.. హీరో, హీరోయిన్ మ‌ధ్య ఉన్న ల‌వ్ కోణాన్ని ఎలివేట్ చేస్తుంది. అలాగే ట్రైల‌ర్‌లో కాలేజ్ స్టూడెంట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌డే గొడ‌వ‌ల స‌న్నివేశాలు..ర‌ష్మిక మంద‌న్నా స్టేట్ క్రికెట్ ప్లేయ‌ర్ అని రివీల్ చేశారు. అలాగే క్రికెట్‌లో ర‌ష్మిక ప‌డే క‌ష్టం చూసిన హీరో ఈ జ‌ర్నీలో నేను నీకు తోడుగా ఉంటాను. న‌న్ను నీ కామ్రేడ్‌లా ఉండ‌ని.. అనే ల‌వ్ ఎమోష‌న‌ల్ డైలాగ్‌ను బ‌ట్టి చూస్తే.. టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం అవ‌గ‌త‌మ‌వుతుంది.

విప‌రీత కోపం, గొడ‌వ‌లు వ‌ల్ల హీరో, హీరోయిన్ మ‌ధ్య దూరం పెరుగుతుందని తెలుస్తుంద‌ని, మూడేళ్ల వ‌ర‌కు హీరోయిన్ కోసం హీరో వెతికే ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతాయ‌ని ట్రైల‌ర్‌లో అర్థ‌మ‌వుతుంది. అలాగే లిప్‌లాక్ సీన్స్‌తో సినిమాలోని రొమాంటిక్ యాంగిల్‌ను ఎలివేట్ చేశారు.
యూత్‌ను ఆక‌ట్టుకునేలా ట్రైల‌ర్‌ను క‌ట్ చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 26న సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.

More News

అసెంబ్లీలోకి 'గాడిద'.. వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు!!

అసెంబ్లీలోకి ‘గాడిద’ అంటే.. నిజంగానే వచ్చిందని కాదండోయ్.. గాడిద అనే పదం ఏపీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చరచ్చకు దారితీసింది. ఇంతకీ అసలేం జరిగింది. గాడిద అనే పదం ఎవరు అన్నారు..?

మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది - హీరో విక్టరీ వెంకటేష్

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థలో తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.

టెంప్ట్ ర‌వి ని బ‌య‌పెడుతున్న ' వైఫ్‌,ఐ'

ఇటీవ‌ల యూట్యూబ్ లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషెక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా,

జులై 19న ద లైన్ కింగ్ సూప‌ర్‌స్టార్స్ వాయిస్ ల‌తో విడుద‌ల‌

క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి.

ఓ బేబీలో రానా?

ఓ బేబీ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో రానా విగ‌ర‌స్‌గా పాల్గొంటున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ త‌ర‌ఫున ఎప్పుడూ సురేష్ బాబు ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటారు.