close
Choose your channels

కామ్రేడ్ పోరాడితే ఆ పోరాటం హాయినివ్వాలి, కానీ...

Thursday, July 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కామ్రేడ్ పోరాడితే ఆ పోరాటం హాయినివ్వాలి, కానీ...

`ఒక కామ్రేడ్ చేసే పోరాటం అత‌నికి హాయినివ్వాలి, స్వేచ్ఛ‌నివ్వాలి. కానీ నిన్ను చూస్తే అలా లేవు`
`వ‌చ్చేట‌ప్పుడు ఎంతో హాయిగా ఉండే ఈ ప్రేమ వెళ్లిపోయేట‌ప్పుడు ఎందుకింత బాధ‌పెడుతుంది`

అనే డైలాగ్స్‌తో డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. బాబీ అనే కాలేజ్ స్టూడెంట్ లీడ‌ర్‌ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తే.. క్రికెట‌ర్ కావాల‌నుకునే లిల్లీ పాత్ర‌లో ర‌ష్మిక న‌టించింది. హీరోయిన్‌ను డ్రీమ్ కోసం ఫైట్ చేయ‌మ‌ని చెప్పే హీరో ఆమెను ఎంక‌రేజ్ చేస్తుంటాడు.. కాబ‌ట్టి అదే ట్యాగ్‌లైన్‌గా `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అని పెట్టార‌ని అర్థమ‌వుతుంది.

ఈ డైలాగ్స్ హీరోలో రెవ‌ల్యూష‌న్‌ను ఆవిష్క‌రిస్తూనే.. హీరో, హీరోయిన్ మ‌ధ్య ఉన్న ల‌వ్ కోణాన్ని ఎలివేట్ చేస్తుంది. అలాగే ట్రైల‌ర్‌లో కాలేజ్ స్టూడెంట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌డే గొడ‌వ‌ల స‌న్నివేశాలు..ర‌ష్మిక మంద‌న్నా స్టేట్ క్రికెట్ ప్లేయ‌ర్ అని రివీల్ చేశారు. అలాగే క్రికెట్‌లో ర‌ష్మిక ప‌డే క‌ష్టం చూసిన హీరో ఈ జ‌ర్నీలో నేను నీకు తోడుగా ఉంటాను. న‌న్ను నీ కామ్రేడ్‌లా ఉండ‌ని.. అనే ల‌వ్ ఎమోష‌న‌ల్ డైలాగ్‌ను బ‌ట్టి చూస్తే.. టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం అవ‌గ‌త‌మ‌వుతుంది.

విప‌రీత కోపం, గొడ‌వ‌లు వ‌ల్ల హీరో, హీరోయిన్ మ‌ధ్య దూరం పెరుగుతుందని తెలుస్తుంద‌ని, మూడేళ్ల వ‌ర‌కు హీరోయిన్ కోసం హీరో వెతికే ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతాయ‌ని ట్రైల‌ర్‌లో అర్థ‌మ‌వుతుంది. అలాగే లిప్‌లాక్ సీన్స్‌తో సినిమాలోని రొమాంటిక్ యాంగిల్‌ను ఎలివేట్ చేశారు.
యూత్‌ను ఆక‌ట్టుకునేలా ట్రైల‌ర్‌ను క‌ట్ చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 26న సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.