ఆగష్టు 7 న నాగార్జున, నాని ల దేవదాస్ ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Sunday,August 05 2018]

నాగార్జున, నాని కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 7 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రీల్యూడ్ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర నిర్మాతలు.. ఈ పోస్టర్ లో ఆల్కహాల్ బాటిల్ ఉండగా పక్కనే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని విషెస్ తెలియజేశారు.

ఈ సరికొత్త ఎంటర్టైనర్ కి యంగ్ డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, ఆకాంక్ష సింగ్, రష్మిక మందాన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.. చివరి దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని వైజయంతి బ్యానర్ పతాకంపై అశ్వినిదత్ నిర్మిస్తుండగా, సి ధర్మరాజు ఈ సినిమాని సమర్పిస్తున్నారు.. సెప్టెంబర్ 27 న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు..

తారాగణం: నాగార్జున అక్కినేని నాని, రష్మిక మండన, ఆకాంక్ష సింగ్, నరేష్ వికె, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఆవసరాల శ్రీనివాస్, సత్య

More News

'రాణి శివగామి' ఫస్ట్‌లుక్ విడుదల

తన అసమాన అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి..నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ.

కుమారి ద‌ర్శ‌కుడితో అక్కినేని హీరో...

అక్కినేని అఖిల్ ఇప్పుడు సినిమాలు చేయ‌డంలో స్పీడు పెంచాడు. ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న అఖిల్ త‌దుప‌రి సినిమా కోసం వ‌రుస క‌థ‌లు వింటున్నాడు.

డెబ్యూ డైరెక్ట‌ర్‌తో బ‌న్ని...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌దుప‌రి సినిమాపై ఎలాంటి స‌మాచారం లేదు. రీసెంట్‌గా ఓ ఆడియో వేడుక‌లో  అల్లు అర్జున్ త‌న త‌దుప‌రి సినిమాకు ఇంకా స‌మయం ప‌డుతుంద‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

నాలుగోసారి జ‌త క‌డుతున్నారు...

సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సింగం సిరీస్ మూడు పార్టుల్లో సూర్య‌, అనుష్క క‌లిసి న‌టించారు. ఇప్పుడు సింగం సిరీస్ కాకుండా సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది.

సుమంత్ క‌న్‌ఫ‌ర్మ్ చేశాడు..

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ సంబంధించిన వ‌ర్క్ చాలా వేగంగా జ‌రుగుతుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్ప‌టికే చాలా మంది న‌టీన‌టులు న‌టిస్తున్నారు.