12 ఏళ్ల 'దేవ‌దాసు'

  • IndiaGlitz, [Thursday,January 11 2018]

ఎలాంటి అంచ‌నాలు లేకుండా వచ్చి.. సంచ‌ల‌నం సృష్టించే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాల‌లో 12 ఏళ్ల క్రితం విడుద‌లైన‌ దేవ‌దాసు ఒక‌టి. రామ్‌, ఇలియానాని హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వై.వి.ఎస్‌.చౌద‌రి స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ యూత్‌ఫుల్ మూవీ .. తొలుత డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. చ‌క్రి పాట‌లు, ఇలియానా అందాలు, రామ్ న‌ట‌న‌, చౌద‌రి టేకింగ్ వంటి కార‌ణాల‌తో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

అమెరికా నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని కొత్త తార‌ల‌తో నిర్మించినా.. చాలా లావిష్‌గా రూపొందించారు. అందాల న‌టి శ్రియ ప్ర‌త్యేక గీతం చేయ‌డ‌మే కాకుండా.. క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర‌లో సంద‌డి చేసింది.

ఈ చిత్రానికిగానూ రామ్ బెస్ట్ డెబ్యూ హీరోగానూ.. ఇలియానా బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గానూ ఫిలింఫేర్ పుర‌స్కారాల‌ను సొంతం చేసుకున్నారు. 17 కేంద్రాల‌లో 175 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ చిత్రం.. జ‌న‌వ‌రి 11, 2006న విడుద‌లైంది.

More News

17 ఏళ్ల `న‌ర‌సింహ‌నాయుడు'

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని చిత్రాలలో న‌ర‌సింహ‌నాయుడు ఒక‌టి. గ‌త రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డ‌మే కాకుండా.. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. బాల‌య్య‌కి ఉత్త‌మ న‌టుడుగా తొలిసారి నంది పుర‌స్కారాన్ని కూడా అందించింది.

'గాయత్రి' చిత్రంలో కీలక పాత్రలో నిఖిల విమల్

డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. కాగా చిత్ర బృందం ప్రధాన తారాగణం పరిచయ పోస్టర్లు ఒక దాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు.

ఈ సారి కూడా వదలని త్రివిక్రమ్

ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీ నివాస్ సినిమా అంటే..వినోదానికి చిరునామా.

నానికి జోడీగా రకుల్?

నేచురల్ స్టార్ నాని..పట్టిందల్లా బంగారమే అవుతోంది ఈ మధ్య.

ఎన్నారైగా రవితేజ

రాజా ది గ్రేట్లో అంధుడి పాత్రలో కనిపించి మెప్పించారు మాస్ మహారాజా రవితేజ.