close
Choose your channels

12 ఏళ్ల 'దేవ‌దాసు'

Thursday, January 11, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎలాంటి అంచ‌నాలు లేకుండా వచ్చి.. సంచ‌ల‌నం సృష్టించే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాల‌లో 12 ఏళ్ల క్రితం విడుద‌లైన‌ దేవ‌దాసు ఒక‌టి. రామ్‌, ఇలియానాని హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వై.వి.ఎస్‌.చౌద‌రి స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ యూత్‌ఫుల్ మూవీ .. తొలుత డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. చ‌క్రి పాట‌లు, ఇలియానా అందాలు, రామ్ న‌ట‌న‌, చౌద‌రి టేకింగ్ వంటి కార‌ణాల‌తో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

అమెరికా నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని కొత్త తార‌ల‌తో నిర్మించినా.. చాలా లావిష్‌గా రూపొందించారు. అందాల న‌టి శ్రియ ప్ర‌త్యేక గీతం చేయ‌డ‌మే కాకుండా.. క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర‌లో సంద‌డి చేసింది.

ఈ చిత్రానికిగానూ రామ్ బెస్ట్ డెబ్యూ హీరోగానూ.. ఇలియానా బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గానూ ఫిలింఫేర్ పుర‌స్కారాల‌ను సొంతం చేసుకున్నారు. 17 కేంద్రాల‌లో 175 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ చిత్రం.. జ‌న‌వ‌రి 11, 2006న విడుద‌లైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.