దేవిశ్రీ ప్ర‌సాద్ 14.. స‌మంత 13..

  • IndiaGlitz, [Wednesday,April 11 2018]

తాజాగా విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లోనూ వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో క‌లుపుకుని క‌థానాయిక స‌మంత ఖాతాలో  13 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ చిత్రాలు ఉండ‌గా.. సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఖాతాలో 14 చిత్రాలు ఉన్నాయి. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. 

‘దూకుడు’తో తొలిసారిగా ఈ క్లబ్‌లో అడుగుపెట్టిన సమంత.. ఆ తర్వాత ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘బ్రహ్మోత్సవం’, ‘అఆ.’, ‘జనతా గ్యారేజ్’, ‘24’, ‘తెరి’, ‘మెర్సల్’, ‘రంగస్థలం’.. ఇలా మొత్తం 13 చిత్రాల‌తో ఈ క్ల‌బ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ద‌క్కించుకుంది. అలాగే.. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘1 నేనొక్కడినే’, ‘సన్నాఫ్  సత్యమూర్తి’, ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘జనతా గ్యారేజ్’, ‘ఖైదీ నంబర్ 150’, ‘దువ్వాడ జగన్నాథ‌మ్‌’, ‘నేను లోకల్’, ‘జై లవకుశ’, ‘ఎంసీఏ’, ‘రంగస్థలం’.. ఇలా మొత్తం 14 చిత్రాల‌తో ఈ క్ల‌బ్‌లో మొద‌టి స్థానంలో నిలిచారు దేవిశ్రీ‌.  వీరిద్దరి మధ్య సాగే ఈ ర‌సవ‌త్త‌ర‌ పోటీలో అంతరం ఒకే ఒక్క అడుగు (ఒకే ఒక్క సినిమా). మ‌రి డీఎస్పీ త‌న స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంటారో లేక స‌మంత ఆ స్థానాన్ని కైవ‌సం చేసుకుంటుందో చూడాలి.

More News

అనుప‌మ‌గా రీతూ వ‌ర్మ‌

వైవిధ్యమైన పోలీస్ కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్.

ఒకే లైన్‌తో రెండు సినిమాలు?

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చేతిలోకి వచ్చేసింది.

మ‌నకి న‌చ్చిన అబ్బాయి మ‌న‌వాళ్ళ‌కి న‌చ్చ‌కపోతే ప్రాబ్ల‌మ్ నాది కాదు అంటున్న‌ 'ఆయుష్మాన్ భ‌వ' హీరోయిన్ హుజ‌న్ 

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేనేలోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి

'ద‌మ్ముంటే సొమ్మేరా' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి

సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై తమిళ్ రూపొందిన  `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని

న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా 'బేవ‌ర్స్ ' చిత్రం మెద‌టి సాంగ్ లాంచ్

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లొ న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్నిసొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్