close
Choose your channels

మ‌నకి న‌చ్చిన అబ్బాయి మ‌న‌వాళ్ళ‌కి న‌చ్చ‌కపోతే ప్రాబ్ల‌మ్ నాది కాదు అంటున్న‌ 'ఆయుష్మాన్ భ‌వ' హీరోయిన్ హుజ‌న్ 

Wednesday, April 11, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌నకి న‌చ్చిన అబ్బాయి మ‌న‌వాళ్ళ‌కి న‌చ్చ‌కపోతే ప్రాబ్ల‌మ్ నాది కాదు అంటున్న‌ ఆయుష్మాన్ భ‌వ హీరోయిన్ హుజ‌న్ 

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేనేలోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌. ఈ చిత్రాన్ని సి టి.ఎఫ్ నిర్మాణ‌భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌నం తో రూపోందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబిడాళ్‌, హంగ్ ఓవ‌ర్‌, హైహీల్స్ లాంటి సూప‌ర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం లో ప్ర‌ముఖ హీరో్యిన్ స్నేహ ఉల్లాల్ చ‌ర‌ణ్ తేజ్ స‌ర‌స‌న న‌టిస్తుంది. స‌మాజం ప్రేమ‌ని చూసే ప‌ద్ద‌లి మారాలి అనే క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెద‌టి లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

మ‌నకి న‌చ్చిన అబ్బాయి మ‌న‌వాళ్ళ‌కి న‌చ్చ‌క‌పోతే ప్రాబ్ల‌మ్ వాళ్ళ‌ది.. దానికి మ‌నం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి.. త‌ప్పు. అలా అని పారిపోతే పిరికితనం.. ఓడిపోతే చేత‌కాని త‌నం.. ఇదే జీవిత‌మా అని ప్ర‌శ్నించే మ‌రో పాత్ర‌లో మ‌రో హీరోయిన్ హుజ‌న్‌. ఈరోజు హుజ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా సారా గా త‌న‌ మెద‌టి లుక్ ని విడుద‌ల చేశారు. హుజ‌న్  

ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ..  ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి క‌థ ని అందించట‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న సూప‌ర్‌స‌క్స్‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన గారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కి నా హ్రుద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు. అలాగే క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి గారి మా చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా భాద్య‌త‌లు స్వీక‌రించినందుకు వారికి నా ద‌న్య‌వాదాలు.

మేము అడిగిన వెంట‌నే మా క‌థ న‌చ్చి మా చిత్రం లో హీరోయిన్ గా చేస్తున్న స్నేహ ఉల్లాల్ థ్యాంక్స్‌, స్నేహ ఉల్లాల్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశాము. మాకు ఆడియో బాలీవుడ్ సూప‌ర్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు మీట్ బ్రోస్ చేస్తున్నారు.  మ‌న తెలుగు రాష్ట్ర‌ల్లో మీట్ బ్రోస్ అందించిన ఆడియో నే యూత్ విప‌రీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్ప‌డు డైర‌క్ట్ గా వాళ్ళు మా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మ‌నకి న‌చ్చిన అబ్బాయి మ‌న‌వాళ్ళ‌కి న‌చ్చ‌క‌పోతే ప్రాబ్ల‌మ్ వాళ్ళ‌ది.. దానికి మ‌నం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి.. త‌ప్పు. అలా అని పారిపోతే పిరికితనం.. ఓడిపోతే చేత‌కాని త‌నం.. ఇదే జీవిత‌మా అని ప్ర‌శ్నించే మంచి పాత్ర‌లో బాలీవుడ్ లో ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్  హంగామా ప్లే, భార‌త్ మెట్రిమెని, పాండ్స్ టి.వి.సి మ‌రియు నెట్‌ఫ్లిక్స్ లాంటి యాడ్స్ లో న‌టించి మెప్పించిన హుజ‌న్ న‌టించింది. చాలా మంచి పాత్ర‌లో చేసింది.

ఈరోజు త‌న పుట్టిన‌రోజు సంద‌ర్బంగా సారా పాత్ర ని రివీల్ చేసాము .. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ స‌మ్మ‌ర్ లోనే చిత్రాన్ని విడుద‌ల చేస్తాము. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాము.. అని అన్నారు..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.