అంత‌ర్జాతీయ స్టేజ్ షోలో ప‌వ‌న్ పాట‌కు డ్యాన్స్‌.. దేవిశ్రీ స్పంద‌న‌

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

తెలుగు సినిమా రేంజ్ మ‌రోసారి ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కు రీచ్ అయ్యింది. వ‌ర‌ల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ రియాలిటీ షోలో భార‌త డ్యాన్స్ గ్రాప్ ది కింగ్స్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఈ డ్యాన్స్ షోలో ఫైన‌ల్‌కు దికింగ్స్ టీం చేసిన డ్యాన్స్ చూసి జెన్నీఫ‌ర్ లోఫెజ్‌, నీయో, డెరెక్ హూగ్ థ్రిల్ అయ్యారు.

ప‌వ‌న్ న‌టించిన 'వాడెవ‌డ‌న్నా.. వీడెవ‌డ‌న్నా..'  అనే పాట‌కు ది కింగ్స్ టీం అద్భుత‌మైన పెర్ఫామెన్స్ చేశారు. ఈ వీడియోను వ‌ర‌ల్డ్ ఆఫ్ డ్యాన్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన దేవిశ్రీ ప్ర‌సాద్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. 'దికింగ్స్' గ్రూపు కాకుండా మ‌రో గ్రూపు పాపుల‌ర్ అమెరిక‌న్ షోలో త‌మ బాణీల‌ను అందించిన ఖైదీ నంబ‌ర్ 150 సినిమాలో 'సుంద‌రి..' పాట‌ల‌కు డ్యాన్స్ చేశార‌నే సంగ‌తిని గుర్తు చేసుకున్నారు. నా సంగీతం ప్ర‌జ‌ల్ని డ్యాన్స్ చేయించ‌డం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ధ‌న్య‌వాదాలు. ల‌వ్ యు గ‌య్స్‌.. మీరు ఎంతో చ‌క్క‌గా డ్యాన్స్ చేశారు. కీప్ రా'కింగ్స్‌' అంటూ ట్వీట్ చేశారు. 

More News

108 గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 60 వాహనాలు దగ్ధం

హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 108 గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. 60 వాహనాలు తగలబడ్డాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింగ్ సిబ్బంది మంటలు ఆర్పింది.

ఆ యాడ్స్ చేయ‌కండి అంటూ హీరోకి అభిమాని వేడుకోలు

పొగాకుకి సంబంధించిన ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌నల్లో న‌టించ‌వ‌ద్దు అంటూ బాలీవుడ్ హీరో అజయ్ దేవ‌గ‌ణ్‌కు నాన‌క్ రామ్ అనే అభిమాని విన్న‌వించుకున్నాడు.

తాప్పీకి చేదు అనుభ‌వం

హీరో  తాప్సీ ప‌న్నుకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంది. ఇంత‌కు అదెక్క‌డో తెలుసా! ఎయిర్ ఇండియా విమానంలో.  ఇటీవ‌ల ఆమె ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఎయిర్ ఇండియా విమానంలో ప్ర‌యాణించారు.

మోదీ.. 'ఎక్స్‌పైరీ పీఎం' అందుకే స్పందించలేదు!

ఉత్తరాంధ్రను దాటిన 'ఫొనీ' తుఫాను ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో విశ్వరూపం చూపించింది!. ఈ తుఫాన్ దెబ్బకు ఇరు రాష్ట్రాల్లో భారీగా ఆస్తినష్టం

ర‌జ‌నీకాంత్‌ను క‌ల‌వాల‌నుకుంటున్న క్రికెట‌ర్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఓ స్టార్ క్రికెట‌ర్ కూడా ఈయ‌న‌కు పెద్ద ఫ్యాన్ అయ్యారు. ఆయ‌నెవ‌రో కాదు.. బ్రావో.