అక్టోబర్ లో 'దేవిశ్రీ ప్రసాద్'

  • IndiaGlitz, [Tuesday,August 29 2017]

ఆర్‌.ఒ.క్రియేష‌న్స్, య‌శ్వంత్ మూవీస్ ప‌తాకాల‌పై సంయుక్తంగా భూపాల్, మ‌నోజ్ నంద‌న్‌,పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న చిత్రం 'దేవిశ్రీ ప్ర‌సాద్‌'. స‌శేషం, భూ చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించారు. ఇందులో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా ....

చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ - ''మా దేవిశ్రీప్ర‌సాద్ చిత్రంలో ప్ర‌తి సన్నివేశంతో ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్ల‌ర్‌లో ప్ర‌తి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్‌ను టెన్ మిలియ‌న్ ప్రేక్ష‌కులు వీక్షించారు. ఓ చిన్న సినిమాకు ఇంత ఆద‌ర‌ణ రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మంచి మెసేజ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో సినిమా సాగుతుంది. సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

More News

ఏడాదికొకటి చేస్తున్న అనూప్

ప్రస్తుతం టాలీవుడ్లో హవా చూపిస్తున్న సంగీత దర్శకులలో అనూప్ రూబెన్స్ ఒకరు. ప్రేమకావాలి, ఇష్క్, మనం, టెంపర్, సోగ్గాడే చిన్ని నాయనా తదితర చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అనూప్..

కళ్యాణ్ రామ్ కి కలిసొస్తారా?

అతనొక్కడే, పటాస్ చిత్రాలతో కథానాయకుడుగా తన సత్తా చాటుకున్నాడు నందమూరి వారి కథానాయకుడు కళ్యాణ్ రామ్. కెరీర్ మొత్తంలో కళ్యాణ్ రామ్కి విజయాన్నిచ్చింది ఈ రెండు చిత్రాలే కావడం గమనార్హం.

చరణ్ తో బోయపాటి?

ఒకరేమో మాస్లో మాంచి ఇమేజ్ ఉన్న కథానాయకుడు.. మరొకరేమో ఊర మాస్ సినిమాలను తీయడంలో దిట్ట అయిన దర్శకుడు. వీరిద్దరు ఒకే సినిమా కోసం కలిసి పనిచేస్తే.. నిజంగా అది మాస్ ప్రేక్షకులకు పండగే.

ఆ రోజుతో 'స్పైడర్' షూటింగ్ పూర్తి

మహేష్ బాబు, మురుగదాస్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం స్పైడర్. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రొమానియాలో షూటింగ్ జరుపుకుంటోంది.

తమన్నా విషయంలో రిపీట్ అవుతుందా?

మొదట ఓ హీరోయిన్ని ఎంచుకోవడం.. ఆమెతో కొన్ని రోజులు షూటింగ్ చేయడం.. ఆ తరువాత ఆమె స్థానంలోకి మరో హీరోయిన్ రావడం.. ఇలాంటివన్ని సినిమా పరిశ్రమలో సర్వసాధారణమే.