ధనుష్ వెర్సెస్ శివ కార్తికేయన్

  • IndiaGlitz, [Friday,October 21 2016]

రఘువరన్‌ బి.టెక్‌' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌. త‌మిళ్ లో ధ‌నుష్ న‌టించిన కోడి అనే టైటిల్ తో రూపొందిన చిత్రాన్ని ధ‌ర్మ‌యోగి అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ధ‌నుష్ మొద‌టిసారి ద్విపాత్రాభిన‌యం చేయ‌డం విశేషం. ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో త్రిష‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించారు.
ఇక శివ కార్తికేయ‌న్ న‌టించిన చిత్రం రెమో. ఈ చిత్రంలో శివ కార్తికేయ‌న్ స‌ర‌స‌న నేన శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ న‌టించింది. భాక్కియ‌రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ధ‌నుష్ న‌టించిన ధ‌ర్మ‌యోగి, శివ‌కార్తికేయ‌న్ రెమో ఈ రెండు చిత్రాల ఆడియో వేడుకలు హైద‌రాబాద్ లో ఒకే రోజు, ఒకే వేదిక‌లో రిలీజ్ అవుతుండ‌డం విశేషం. ధ‌నుష్, శివ కార్తికేయ‌న్ వీరిద్ద‌రి మ‌ధ్య కోలీవుడ్ లో పోటీ న‌డుస్తుంది అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో ఈ కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ లో కూడా పోటీప‌డుతుండ‌డం విశేషం.

More News

నన్ను కొత్తగా చూపించనట్టే పూరి గార్ని కూడా కొత్త ఆవిష్కరించే విభిన్న కథా చిత్రం ఇజం - కళ్యాణ్ రామ్

అతనొక్కడే,లక్ష్మికళ్యాణం,హరేరామ్,ఓం,పటాస్...ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించిన యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్.

కథ బాగుంటే చాలు...ఆడియోన్స్ చూస్తున్నారు. ఆ చిత్రాల వలే మా శంకర చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నా నమ్మకం - నారా రోహిత్

నారా రోహిత్ - రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం శంకర. ఈ చిత్రాన్ని భీమిలి కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ చిత్రాల దర్శకుడు తాతినేని సత్యప్రకాష్ తెరకెక్కించారు. సాయిలీల మూవీస్ బ్యానర్ పై ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్, ఎం.వి.రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

బాహుబ‌లి 2 మేకింగ్ వీడియో రిలీజ్ డీటైల్స్..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న బాహుబ‌లి 2 లోగోను ఇటీవ‌ల రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

దీపావ‌ళికి వ‌స్తున్న సూర్య సింగం-3 టీజ‌ర్..!

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

నాని న్యూమూవీ డీటైల్స్!

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం నేను లోక‌ల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఆ మూవీ త‌ర్వాత నాని నూత‌న ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ లాల‌మ్ తో ఓ మూవీ చేయ‌నున్నారు.