close
Choose your channels

కథ బాగుంటే చాలు...ఆడియోన్స్ చూస్తున్నారు. ఆ చిత్రాల వలే మా శంకర చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నా నమ్మకం - నారా రోహిత్

Thursday, October 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నారా రోహిత్ - రెజీనా జంట‌గా న‌టిస్తున్న చిత్రం శంక‌ర‌. ఈ చిత్రాన్ని భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు, ఎస్.ఎం.ఎస్ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌ప్ర‌కాష్ తెర‌కెక్కించారు. సాయిలీల మూవీస్ బ్యాన‌ర్ పై ఆర్.వి. చంద్ర‌మౌళి ప్ర‌సాద్, ఎం.వి.రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 21న శంక‌ర చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా శంక‌ర గురించి హీరో నారా రోహిత్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...!
శంక‌ర చిత్రంలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?
ఈ చిత్రంలో నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని క్యారెక్ట‌ర్ చేసాను. నాకు ఈ క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంది. డైరెక్ట‌ర్ స‌త్య నా క్యారెక్ట‌ర్ ను యూత్ కి క‌నెక్ట్ అయ్యేలా బాగా డిజైన్ చేసారు.
ఇంత‌కీ...శంక‌ర కాన్సెప్ట్ ఏమిటి..?
స్టూడెంట్ కి, పోలీస్ కి మ‌ధ్య జ‌రిగే వారే శంక‌ర క‌థ‌. ఏ త‌ప్పు చేయ‌కుండా స్టూడెంట్ ఓ కేసులో ఇరుక్కుంటాడు. ఆత‌ర్వాత ఆ కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు..? కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఏం చేసాడు అనేది ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది.
శంక‌ర త‌మిళ్ మూవీ మౌన‌గురు సినిమాకి రీమేక్ క‌దా..! మ‌న నేటివిటికి త‌గ్గ‌ట్టు ఎలాంటి మార్పులు చేసారు..?
మౌన‌గురు మూవీనే మురుగుదాస్ హిందీలో అకిరా అనే టైటిల్ తో రీమేక్ చేసారు.ఇక మార్పులు అంటే... ఈ మూవీలో 40 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ను ఈ సినిమాలో నాలుగు నిమిషాల సాంగ్ లో చూపించాం. తెలుగు ఆడియోన్స్ అభిరుచికి త‌గ్గ‌ట్టు మార్పులు చేసాం. అందుచేత మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం.
మీ సినిమాలు ఒక‌టి ఆడియో ఫంక్ష‌న్ జ‌రుగుతుంటే ఇంకొటి రిలీజ్ అవుతుంది. మ‌రో రెండు మూడు సినిమాలు సెట్స్ పై ఉంటున్నాయి. దీంతో మీ సినిమాల్లో ఏ సినిమా రిలీజ్ అయ్యిందో తెలియ‌డం కాస్త క‌న్ ఫ్యూజ్ గా ఉంటుంది. గ్యాప్ లేకుండా వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ చేస్తుండ‌డానికి కార‌ణం..?
నేను అదే ఆలోచిస్తున్నాను. అందుచేత ఇక నుంచి ఎలాంటి క‌న్ ఫ్యూజ‌న్ లేకుండా ఒక సినిమాకి మ‌రో సినిమాకి గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నాను. సో..ఇక నుంచి ఎలాంటి క‌న్ ఫ్యూజ‌న్ ఉండ‌దు.
మీరు ఎక్కువ సినిమాలు చేస్తుండ‌డంతో మీ స్నేహితులే మీతో సినిమాలు చేస్తున్నార‌ని, అలాగే మీతో సినిమాలు చేయ‌డానికి మీ వెన‌క ఎవ‌రో పెట్టుబ‌డులు పెట్టే వ్య‌క్తులు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది నిజ‌మేనా..?
నా వెన‌క అలా పెట్టుబ‌డులు పెట్టే వ్య‌క్తులు ఎవ‌రూ లేరు. నిజంగా ప్ర‌చారంలో ఉన్న‌ట్టు నా వెన‌క అలాంటి వ్య‌క్తులే ఉంటే...చిన్న సినిమాలు చేయ‌డం ఎందుకు భారీ ప్రాజెక్ట్స్ చేసేవాడిని క‌దా..! ప్ర‌చారంలో ఉన్న‌వి వాస్త‌వం కాదు.
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఇజం, మీ సినిమా శంక‌ర్ ఓకే రోజు రిలీజ్ అవుతున్నాయి క‌దా..! ఎవ‌రు ఎవ‌రికి పోటీ..?
మా సినిమా రిలీజ్ డేట్ ను ముందుగానే ఎనౌన్స్ చేసాం. క‌ళ్యాణ్ రామ్ ఇజం కూడా 21 రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావ‌డం అనేది అనుకోకుండా జ‌రిగింది. ఎవ‌రు ఎవ‌రికి పోటీ కాదు. రెండు సినిమాలు ఆడాల‌ని కోరుకుంటున్నాను.
మీరు చేయాల‌నుకుంటే ఓ భారీ సినిమా చేయ‌చ్చు క‌దా...! మ‌రి... చిన్న సినిమాలే చేస్తుండ‌డానికి కార‌ణం..?
భారీ సినిమా, చిన్న సినిమా అనే తేడా లేదు అని నా అభిప్రాయం. ఆడియోన్స్ పెద్ద సినిమా, చిన్న సినిమా అని చూడ‌డం లేదు. సినిమా బాగుందా లేదా అనేదే చూస్తున్నారు. సినిమా బాగుంటే చిన్న సినిమా అయినా చూస్తున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, పెళ్లిచూపులు...చిత్రాల‌ను క‌థ న‌చ్చ‌డం వ‌ల‌నే చూసారు. అందుచేత క‌థ బాగుంటే చాలు అనుకుంటాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, క‌థ‌లో రాజ‌కుమారి చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలాగే ప‌వ‌న్ సాధినేనితో భీముడు అనే సినిమా ప్లాన్ చేస్తున్నాం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.