Choreographer Chaitanya:'ఢీ' కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. వాళ్లకు రుణపడి వుంటా, సెల్ఫీ వీడియో వైరల్

  • IndiaGlitz, [Monday,May 01 2023]

ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షో 'ఢీ'లో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు క్లబ్ హోటల్లో ఆదివారం ఆయన ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పులు తీర్చలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కుదరలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చైతన్య వెల్లడించారు. అప్పులు ఇచ్చినవాళ్ల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక.. గత్యంతరం లేని పరిస్ధితుల్లోనే ఇలా చేస్తున్నానని చైతన్య తన సెల్పీ వీడియోలో తెలిపారు.

తోటి కొరియోగ్రాఫర్ల దిగ్భ్రాంతి :

తనకు నేమ్, ఫేమ్ ఇచ్చిన ఢీ షోకు ఎప్పటికీ రుణపడి వుంటానని ఆయన తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే చైతన్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తోటి కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు , పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చైతన్య ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

More News

KCR:తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. ఆరు కీలక ఫైళ్లపై తొలి సంతకం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

Venkat:వెంకట్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ ప్రారంభం!!

మైత్రి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ గా తెరకెక్కబోతున్న సినిమా ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

Rashmika:అక్క కోసం ఒంటరిగా చెన్నైకి.. ‘‘రెయిన్‌ బో’’ సెట్స్‌లో చెల్లితో రష్మిక సందడి, ఆ హగ్స్ ది బెస్ట్ అన్న నేషనల్ క్రష్

రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా చలామణి అవుతున్న నటి.

Rajinikanth:ఎన్టీఆర్‌లా మేకప్ వేసుకున్నా.. నా ఫ్రెండ్ కోతిలా వున్నానని అన్నాడు, 2024లో చంద్రబాబు గెలిస్తే : రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌ను స్పూర్తిగా తీసుకునే తాను సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు సూపర్‌స్టార్ రజనీకాంత్. శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో

Samantha:సమంత స్టంట్స్ చూశారా.. సూపర్‌ ఉమెన్‌ లుక్‌లో సామ్, ఆ దెబ్బకు ప్రత్యర్థులు చిత్తే

సమంత.. ఈ పేరు తెలియని వారుండరు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సామ్.