close
Choose your channels

Rashmika:అక్క కోసం ఒంటరిగా చెన్నైకి.. ‘‘రెయిన్‌ బో’’ సెట్స్‌లో చెల్లితో రష్మిక సందడి, ఆ హగ్స్ ది బెస్ట్ అన్న నేషనల్ క్రష్

Sunday, April 30, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా చలామణి అవుతున్న నటి. మాతృభాష కన్నడ కంటే తెలుగులో సినిమాలు చేసిన తర్వాతే ఈమెకు స్టార్ డమ్ వచ్చింది. ఛలో సినిమా తర్వాత రష్మిక ఓవర్‌నైట్ స్టార్ అయ్యింది. అందులో ఈమె అందానికి, నటనకు యువత ఫిదా అయ్యారు. ఆ తర్వాత కాలం కలిసి రావడంతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు సక్సెస్ కావడంతో ఏకంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత భీష్మ, పుష్ప వంటి హిట్లతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో రెండు చేతుల సంపాదిస్తోంది.

చెల్లెలంటే రష్మిక పంచ ప్రాణాలు :

అయితే కెరీర్‌లో ఎంత బిజీగా వున్నప్పటికీ.. తన కుటుంబానికి అంతే ప్రాధాన్యతనిస్తున్నారు రష్మిక. వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వెళ్లిపోయి తన తల్లి చేతి వంట రుచి చూడాల్సిందే. అంతేకాదు తన చిట్టి చెల్లెలు షిమన్ మందన్నాతో ఆడుకుంటూ, ఆమెను ముద్దు చేస్తూ వుంటారు. తన సినిమా షూటింగ్‌లకు సైతం ఆ పాపను తీసుకెళ్తూ వుంటారు. గతంలో కన్నడ పవర్‌స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన అంజనీ పుత్ర షూటింగ్‌కు తీసుకెళ్లారు. తాజాగా రెయిన్‌బో మూవీ సెట్స్‌కి షిమన్‌ను తీసుకెళ్లింది రష్మిక. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రశాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చెన్నై, మున్నార్ తదితర అందమైన లోకేషన్‌లలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రష్మిక, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాను హిందీ సహా ఇతర భాషల్లోనూ విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇది రష్మికకు తొలి పాన్ ఇండియా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ.

చెన్నైలో నాన్ స్టాప్‌గా రెయిన్ బో షూటింగ్ :

ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షూటింగ్‌కు షిమన్ వెళ్లింది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో వుంటున్నారు రష్మిక కుటుంబ సభ్యులు. అక్కడికి దగ్గరలోనే వున్న ఎయిర్‌పోర్ట్ నుంచి షిమన్ అక్కని చూడటం కోసం చెన్నైకి ఒంటరిగా వెళ్లిందట. షూటింగ్ స్పాట్‌కు చేరుకుని బ్రేక్ సమయంలో అక్క రష్మికకు హగ్స్ ఇచ్చింది. ఆ తర్వాత షిమన్‌ను ఇంటికి తీసుకెళ్లేందుకు రష్మిక తల్లి సుమన్ మందన్న చెన్నైకి వెళ్లారట. షూటింగ్ సమయంలో చెల్లెలు ఇచ్చే హగ్స్ బెస్ట్ అని రష్మిక తెలిపారు. రెయిన్ బో ఫస్ట్ షెడ్యూల్ 23 రోజులు నాన్‌స్టాప్‌గా జరిగిందని ఆమె పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.