Major: మేజర్ చూసి ఆమె నన్ను హత్తుకున్నారు.. నాపై ఇంకా బాధ్యత పెరిగింది: శశికిరణ్‌ తిక్క

  • IndiaGlitz, [Thursday,June 09 2022]

మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు దర్శకుడు శశికిరణ్ తిక్కా. ఆయన దర్శకత్వంలో అడవి శేష్ నటించిన మేజర్ ఇటీవల రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శశికిరణ్ మీడియాతో ముచ్చటించారు. మేజర్‌ సినిమా చూసి టాలీవుడ్, బాలీవుడ్ నుంచి మంచి ప్రశంసలు అందుతున్నట్లు తెలిపారు. అల్లు అర్జున్ , రానా వంటి స్టార్స్ ఫోన్ చేసి మరి మెచ్చుకుంటున్నారని శశికిరణ్ తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా మేజర్ ప్రివ్యూ చూశాక సందీప్ ఉన్నికిషన్ అమ్మ గారు తనను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారని ఆయన చెప్పారు. విక్రమ్, పృథ్వీరాజ్ చిత్రాలతో చూస్తే మాది చిన్న చిత్రమే అయినా బాలీవుడ్‌‌లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయని శశికిరణ్ వెల్లడించారు.

2020లోనే మేజర్ రావాల్సింది:

మేజర్ సినిమా వాస్తవానికి 2020లోనే విడుదలవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. 40 శాతం షూటింగ్ కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశామని... కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా ఆపేయాల్సి వచ్చిందని శశికిరణ్ తెలిపారు. తిరిగి షూటింగ్ మొదలుపెట్టే సమయానికి ప్రకాష్ రాజ్, రేవతి వంటి ఆర్టిస్టుల డేట్స్ దొరకలేదని.. డబ్బింగ్ సహా చాలా పనుల్ని పూర్తి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తుచేసుకున్నారు. మేజర్ సినిమాలో కమర్షియల్ లుక్ కోసం పాటలు, ఫైట్స్ పెట్టొచ్చని.. కానీ తాము ఎక్కడా ఆ లైన్ క్రాస్ కాలేదని శశికిరణ్ తెలిపారు కథను ఎంత హుందాగా, సహజంగా తెరకెక్కించాలో అదే పద్ధతిలో వెళ్లామని చెప్పారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నా:

మేజర్‌కు వచ్చిన పేరు, ఈ సినిమా తనకు తీసుకొచ్చిన గుర్తింపుతో భవిష్యత్తులో చేయబోయే సినిమాలను జాగ్రత్తగా చేయాలనుకుంటున్నానని శశికిరణ్ పేర్కొన్నారు. ఏ సినిమా చేసినా ఏదో ఒక మంచి కథను చెప్పాలని ఉందన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమాకు ఒప్పందం కుదిరిందని.. అది ఎవరితో చేస్తాననే దానిపై ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. కనీసం ఆరేడు నెలలు కథ మీద కసరత్తు చేయాలని ఆ తర్వాతే హీరోను సెలెక్ట్ చేసుకుంటానని శశికిరణ్ పేర్కొన్నారు.

బ్రిటీష్ కాలం నాటి కథతో సినిమా:

బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా రూపొందించాలని ఉందని.. మరికొన్ని కథలు ఐడియాల రూపంలో, చిన్న డ్రాఫ్ట్‌లుగా ఉన్నాయని ఆయన చెప్పారు. తాను సినిమాల ఎంపికలో తొందరపడటం లేదని.. కాకపోతే ఏడాదికి ఒకటైనా చేసుకుంటూ వెళ్లాలని భావిస్తున్నానని శశికిరణ్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో నిర్మాతలకు కూడా పెట్టుబడి రాబట్టుకునే మార్గాలు పెరిగాయని.. అందుకే వారు ఇండస్ట్రీలోనే ఉంటూ కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారని వెల్లడించారు.

గూఢచారి 2కి నేను డైరెక్టర్‌ని కాదు:

ఇకపోతే.. హీరో అడవి శేష్‌తో అనుబంధం గురించి శశికిరణ్ మాట్లాడుతూ...అతనితో తనకు మంచి స్నేహం ఉందన్నారు. గూఢచారి , మేజర్‌కి ఇద్దరం కలిసే పనిచేశామని గుర్తుచేసుకున్నారు. తనకు పేరు కంటే సంతృప్తి, గొప్ప సినిమా చేశామనే సంతోషం ముఖ్యం. ఆ రెండూ తనకు దక్కాయని శశికిరణ్ తెలిపారు. తనకే పేరు రావాలని తానెప్పుడూ కోరుకోలేదని.. గూఢచారి, మేజర్ సినిమాలలో ఏ అంశానికి పేరొచ్చినా అందులో దర్శకుడిగా నాకూ భాగముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గూఢచారి 2 సినిమాకు తాను దర్శకత్వం వహించడం లేదని శశికరణ్ స్పష్టం చేశారు. కానీ ఆ సినిమా స్క్రిప్టు కానీ, మరో క్రియేటివ్ విషయంలో గానీ సహకరిస్తానని ఆయన వెల్లడించారు. కుదిరితే గూఢచారి ఫ్రాంఛైజీలో మరో సినిమాకు దర్శకత్వం వహిస్తానని శశికిరణ్ వివరించారు.

More News

Credit Card-UPI : ఇక క్రెడిట్ కార్డుతోనూ యూపీఐ పేమెంట్స్... బోలెడన్నీ లాభాలు..?

దేశంలో నోట్ల రద్దు తర్వాతి నుంచి డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

sajjala rama krishna reddy: మీ ‘‘బ్రోకర్’’ బాగోతం మొత్తం తెలుసు.. పవన్ జోలికొచ్చారో : సజ్జలకు పోతిన మహేశ్ వార్నింగ్

వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్.

nadendla manohar: వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం.. తాగునీటి కోసం 8 లక్షల మంది కటకట: నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పోలవరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్మించిన

Auto Debit: ఆటో డెబిట్‌పై ప్రజలకు ఆర్‌బీఐ తీపి కబురు .. ఇక రూ.15 వేల వరకు ఓటీపీతో పనిలేదు

బ్యాంకింగ్ , ఆర్ధిక సేవలకు సంబంధించి బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలు కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

AP SSC Results : టీచర్లకు మద్యం షాపుల్లో డ్యూటీలు.. రిజల్ట్స్ ఇలా కాక ఎలా, మీ వల్లే పిల్లలు ఫెయిల్: పవన్

ఏపీలో పదో తరగతి పరీక్షల్లో లక్షలాది మంది విద్యార్ధులు ఫెయిల్ అయిన వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.