జులై 19 న డిస్నీ లయన్ కింగ్ విడుదల

  • IndiaGlitz, [Sunday,June 02 2019]

క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పత్రాలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమా గా 90లో విడుదల చేసారు.

అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్ అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది.

ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది.

More News

'సెవెన్'లో లిప్‌లాక్ లేని హీరోయిన్ నేనే అనుకుంట‌! - పూజితా పొన్నాడ

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'.

‘టిక్‌టాక్‌’లో వీడియోలు చేస్తోందని భార్యను చంపేశాడు!

రోజురోజుకు పెరుగున్న టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

వైసీపీ తరఫున పోటీ చేయలేకపోయిన డైరెక్టర్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

చైర్మెన్ పదవి కోసం జయసుధ, అలీ, పృథ్వీ పోటాపోటీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నవ్యాంధ్ర సీఎంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుంది.

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` సెన్సార్ పూర్తి.. జూన్ 21న విడుద‌ల‌

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌`.