close
Choose your channels

చైర్మెన్ పదవి కోసం జయసుధ, అలీ, పృథ్వీ పోటాపోటీ!

Sunday, June 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చైర్మెన్ పదవి కోసం జయసుధ, అలీ, పృథ్వీ పోటాపోటీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నవ్యాంధ్ర సీఎంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుంది. మరోవైపు టికెట్లు దక్కని వైసీపీ నేతలు, పార్టీకి సపోర్ట్ చేసిన నేతలు నామినేటెడ్ పోస్టుల వరిస్తాయని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. కాగా.. నామినెటెడ్ పోస్టుల్లో ఉన్న టీడీపీ నేతలు స్వచ్ఛందంగా రాజీనామా చేయగా.. మరికొందరు మాత్రం తామే కొనసాగుతామని అవసరమైతే వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) చైర్మన్ పదవి కోసం వైసీపీలో చేరిన సీని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పోటాపోటీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సినిమా, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) చైర్మన్‌ 2014-2019 మే వరకు ఉన్న అంబికా కృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేసింది ఆసల్యం ఆ పదవి తనకంటే తనకు కావాలని ముఖ్యమంత్రి జగన్ దగ్గర నేతలు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారట. వీరిలో సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, సీనియర్ కమెడియన్ అలీ, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా.. ఎప్పట్నుంచో వైసీపీలో కొనసాగుతున్న పృథ్వీకి ఎన్నికల ముందు అధిష్టానం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. మరోవైపు జయసుధ ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే హోదా అనుభవించేశారు. అయితే.. ఇక మిగిలిందల్లా కమెడియన్ అలీ మాత్రమే. ఆయన ఎన్నికల ముందు టీడీపీ టికెట్ ఆశించి.. భంగపడి ఆఖరికి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో కచ్చితంగా కీలక పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని సమాచారం.

జయసుధ సీనియర్‌ నటి కావడంతోపాటు పరిశ్రమలో అందరితోనూ సత్సంబంధాలు ఉండటం ఆమెకు కలిసి వచ్చే అంశమని కచ్చితంగా ఆమె పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు అలీ మాత్రం ఆ పదవి తనకే వస్తుందని సన్నిహితుల ధీమా వ్యక్తం చేస్తున్నారట. అయితే పార్టీ అధికారంలో వస్తే ఏదైనా కీలక పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న అలీకి ఈ పదవి దక్కుతుందో..? లేకుంటే జయసుధకే ఈ పదవి దక్కుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.