రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ డాలీ మృతి, మాటలు రావడం లేదంటూ సురేఖవాణి పోస్ట్

శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్, నటి డాలీ కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ నటి సురేఖా వాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకుంటూ “డాలీ ఇది అన్యాయం… నమ్మడానికి కష్టంగా ఉంది… నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు… టోటల్లీ బ్లాంక్” అంటూ పోస్ట్ చేశారు. డాలీ మరణవార్త తెలుసుకున్న ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.

డాలీ అసలు పేరు గాయత్రీ. ఇండస్ట్రీలో జూ.ఆర్టిస్ట్‌ గా పని చేస్తూ యూట్యూబర్‌గా ఫేమస్ అయ్యారు. 'బిగ్ బాస్' ఫేమ్ సిరి హనుమంతు నటించిన 'మేడమ్ సార్ మేడమ్ అంతే'తో పాటు 'జల్సారాయుడు' యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. నటి సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రీతకు డాలీ చాలా సన్నిహితురాలు.

హోలీ పర్వదినం సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పికప్‌ చేసుకున్నాడు రోహిత్‌ అనే వ్యక్తి. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఓ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయత్రి కారును డ్రైవ్‌ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలిలోనే గాయత్రి మరణించగా, రోహిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను గచ్చిబౌలిలోని AIG లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More News

కర్ణాటకలో ఘోర  రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం, చెల్లాచెదురుగా మృతదేహాలు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమ్మక్క- సారక్కలపై వ్యాఖ్యలు ... స్పందించిన చిన్నజీయర్

ఆదివాసి దేవతలైన సమ్కక్క- సారక్కలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై చినజీయర్ స్వామి స్పందించారు.

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు.. కొత్తది ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న "శ్రీ శ్రీ శ్రీ రాజావారు'' ఫస్ట్ లుక్ విడుదల

ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ ( జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు) కథానాయకుడిగా

‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి బెదిరింపులు.. కేంద్రం సీరియస్ , ‘వై’కేటగిరీ భద్రతకు గ్రీన్ సిగ్నల్

1990వ దశకంలో జమ్మూకాశ్మీర్‌లో చోటు చేసుకున్న కాశ్మీరి పండిట్ల ఊచకోతను ఆధారంగా చేసుకుని వివేక్ తెరకెక్కిన ‘‘ది కశ్మీర్ ఫైల్స్’’