close
Choose your channels

జనసేన-టీడీపీ బంధంపై ఎన్నెన్ని అనుమానాలో..!?

Tuesday, March 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ-జనసేన కుమ్మక్కయ్యాయని.. పైకి మాత్రమే విడిగా పోటీ చేస్తున్నారని.. కలిసి పోటీ చేస్తే తనకు రావాల్సిన ఓట్లు కూడా పడవని పవన్ భయపడి ఇలా చేస్తున్నారని.. చంద్రబాబు నుంచి రావాల్సిన ప్యాకేజీ పవన్‌కు అందిందని గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీ బల్లగుద్ది చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు.. పవన్ కల్యాణ్ పట్టీ పట్టనట్లుగా టీడీపీపై అంతంత మాత్రమే విమర్శలు గుప్పించడం.. మరోవైపు చంద్రబాబు మాత్రం పవన్ పేరే ఎత్తకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది.

ముఖ్యంగా జిల్లాల పర్యటనలో చంద్రబాబు, లోకేశ్, తెలుగుదేశం నేతలపై ఒంటికాలిపై లేచి విమర్శలు గుప్పించిన పవన్‌లో ఆనాటి ఆవేశం, కసి కనపడలేదు. ఈ విషయం కాస్త రాజకీయాల గురించి ఐడియా ఉన్నవారికి క్లారిటీ అర్థమవుతుందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాదు జనసేన బలమైన నేతలు పోటీ చేసే చోట టీడీపీ నామమాత్రంగానే పోటీ చేయిస్తోందని.. టీడీపీ బలంగా ఉన్న చోట జనసేన ఇవ్వాల్సిన వారికి టికెట్ ఇవ్వకుండా ముక్కూ మొహం తెలియని నేతలకు ఇచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి.

కాస్త ఈ లాజిక్ చూడండి!

ఈ బంధంపై మరింత లోతుగా వెళితే.. గంటా శ్రీనివాసరావు మీద పోటీ చేసే జనసేన అభ్యర్థి ఉషా కిరణ్. ఈమె భర్త గంటాకు అత్యంత సన్నిహితుడు. ఇక పవన్ కల్యాణ్ విషయానికొస్తే ఆయనపై పోటీ చేసే వ్యక్తి టీడీపీ అభ్యర్థి గంటాకు స్వయంగా వియ్యంకుడు కావడం గమనార్హం. ఇలా లెక్కలేసి మరీ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపుతున్నారు.

ఇంతకీ పవన్ టార్గెట్ ఎవరో..!?

ప్రశ్నిస్తానన్న పవన్ అధికార పార్టీని ప్రశ్నించాలా..? లేక ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించాలా..? బహిరంగ సభల్లో స్పీచ్ మొదలైతే చాలు మాట ముందు జగన్.. తర్వాత జగన్ అంతేనా..? ఇంతకీ తమరి టార్గెట్ ఎవరంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేస్కోవచ్చు. మరోవైపు జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు.. పవన్‌ను ఓ రేంజ్‌‌లో ఆడేసుకుంటున్నారు. ఇవన్నీ అటుంచితే టీడీపీ మహిళా నేత యామిని సాధినేని ఒకానొక సందర్భంలో పవన్‌పై వ్యక్తిగత విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య పూర్తిగా పవన్‌ ప్రస్తావనే లేకుండా ప్రసంగాలు చేస్తుండటం వెనుక మర్మమేంటో ఆ పెరుమాళ్లకే ఎరుక అంటూ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు సెటైర్లేస్తున్నారు.

అయితే అనుమానాలపై నివృతి చేయకపోతే పదేపదే ఇలాంటివన్నీ తెరపైకి వస్తుంటాయ్.. పవన్ ఇకనైనా మేల్కొని ఇలాంటి పుకార్లకు.. అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెడితే ఎందుకైనా మంచిదని విశ్లేషకులు సలహాలిస్తున్నారు. ఇన్ని విషయాలు తెలిసిన పవన్ అలెర్ట్ అవుతారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.