ఒక్క మామిడి కాయ ధర రూ.21 వేలు.. 9 శునకాలు, 3 గార్డ్స్ తో తోటకు కాపలా!

  • IndiaGlitz, [Saturday,June 26 2021]

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్, జబల్పూర్ కి చెందిన సంకల్ప్ సింగ్ పరిహర్ అనే రైతు తన మామిడి తోటకు 9 జర్మన్ షిపార్డ్ కుక్కలు, ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ ని కాపలాగా ఉంచాడు. ఒక మామిడి తోటకు ఇలా హై లెవల్ సెక్యూరిటీ అంటే వినడానికి ఆశ్చరంగానే ఉంటుంది.

వివరాల్లోకి వెళితే.. సంకల్ప్ సింగ్ కు 12 ఎకరాల మామిడి తోట ఉంది. దాదాపు 1100 మామిడి చెట్లు ఉన్నాయి. ఇందులో 50 మామిడి చెట్లు 'టాయెనో టమాగో' అనే జపనీస్ రకానికి చెందిన వంగడం. ఈ రకానికి చెందిన ఒక్క మామిడి కాయ ధర రూ. 21 వేలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా దీనికి పేరు ఉంది.

పర్యావరణం చాలా సమతుల్యంగా ఉండే ప్రాంతాల్లోనే ఈ చెట్లు పెరుగుతాయి. సంకల్ప్ ఐదేళ్ల క్రితం ఈ మొక్కలని తెప్పించి తన తోటలో నాటగా ఇప్పుడు కాపుకి వచ్చాయి. ప్రస్తుతం 50 చెట్లలో నాలుగు కాయలు మాత్రమే ఉన్నాయి. కాపు మొదలైన ఈ తరుణంలోనే కాపలా అవసరం అని భావించిన సంకల్ప్ హై లెవల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు.

ఈ మామిడి కాయల విలువ తెలిసి కొందరు ఇటీవల దొంగతనానికి కూడా ప్రయత్నించినట్లు తెలిపాడు. 'టాయెనో టమాగో' ఒక్క మామిడి కాయ ధర గతంలో 2.7 లక్షల వరకు ఉండేదట. చెన్నై నుంచి 2.5 లక్షల ఖర్చుతో ఏ రకానికి చెందిన 100 మామిడి చెట్లని సంకల్ప్ కొన్నాడు. వాటిలో 50 మాత్రమే పెరిగి పెద్దయ్యాయి.

More News

రామ్ సినిమాకి ట్రబుల్.. దర్శకుడిపై ఫిర్యాదు, ఏం జరిగిందంటే..

తమిళ క్రేజీ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు హీరో రామ్ పోతినేని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

సోషల్ మీడియా నుంచి వైదొలిగిన కొరటాల శివ.. కారణం అదేనా!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సడెన్ గా తాను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

బండ్ల గణేష్ మాట్లాడితే అంతేగా.. ప్రభాస్, రాజమౌళిపై కామెంట్స్!

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎక్కడున్నా తన ప్రత్యేకత చాటుకుంటాడు.

సప్తగిరి నెక్స్ట్ మూవీ షూటింగ్ పూర్తి.. వైవిధ్యమైన కథతో..

కమెడియన్ సప్తగిరి హీరోగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.

'లాల్ సలాం' వెబ్ సిరీస్ రివ్యూ

ఓటిటిలో వెబ్ సిరీస్ ల సందడి బాగా ఉంది. తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా జీ 5 ఓటిటిలో 'లాల్ సలాం'