close
Choose your channels

'లాల్ సలాం' వెబ్ సిరీస్ రివ్యూ

Friday, June 25, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లాల్ సలాం వెబ్ సిరీస్ రివ్యూ

ఓటిటిలో వెబ్ సిరీస్ ల సందడి బాగా ఉంది. తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా జీ 5 ఓటిటిలో 'లాల్ సలాం' అనే వెబ్ సిరీస్ విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకునే విధంగా ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ

ఎన్ని టెన్షన్ ఉన్నా మందేసుకుంటూ, చిందేసుకుంటూ బిందాస్ గా గడిపే ఐదుగురు యువకులు స్నేహితులుగా ఉంటారు. వీరంతా ఒకే రూమ్ లో ఉంటారు. వీళ్ళతో పాటు కలసి మెలిసి ఉండే ఓ బాబాయ్.. వీరంతా చాలా సరదాగా బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు.

వాళ్లకున్న చిన్న చిన్న టెన్షన్స్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఐదుగురు యువకులు జాన్, రెడ్డి, నాయుడు, వర్మ, ఖాన్ బొగత వాటర్ ఫాల్స్ కి ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారితో పాటు బాబాయ్ కూడా జాయిన్ అవుతారు. అనుకోకుండా ఆ యువకులు ఫారెస్ట్ లో చిక్కుకుపోతారు.

రెడ్డి అనే యువకుడు పొరపాటున ల్యాండ్ మైన్ పై కాలేస్తాడు. అతడిని రక్షించడానికి మిగిలిన వారికి తిప్పలు మొదలవుతాయి. అదే సమయంలో ఎమ్మెల్యే (హర్షవర్ధన్) ఆ ఫారెస్ట్ ప్రాంతంలో ఆదివాసీ గ్రామాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. దీనిని అడ్డుకునేందుకు నక్సలైట్స్ ప్రయత్నిస్తుంటారు.

చివరకు ల్యాండ్ మైన్ పై కాలేసిన యువకుడిని అతడి స్నేహితులు రక్షించారా? ఎమ్మెల్యే ఎందుకు ఆ గ్రామాన్ని తగలబెట్టాలని అనుకుంటున్నాడు ? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.

విశ్లేషణ

లాల్ సలాం ప్రచార చిత్రాల్లో కామెడీని హైలైట్ చేస్తూ వచ్చారు. సెట్ చేసిన అంచనాలకు తగ్గట్లుగానే ఫన్ ఈ వెబ్ సిరీస్ లో వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తొలి మూడు ఎపిసోడ్స్ లో నవ్వులు పూయించే ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి.

బ్యాచిలర్ యువకుల మధ్య ఉండే సరదా గొడవలు, ఎంజాయ్ మెంట్ ని ఫన్ జోడించి సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. కథ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యే వరకు బాగా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఆ తర్వాత మాత్రం అవే అరుపులు కేకలు రిపీట్ అయినట్లుగా అనిపిస్తుంది.

కథ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాక ఎక్కువ భాగం డార్క్ థీమ్ లో నడుస్తుంది. కాబట్టి విజువల్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కామెడీని వర్కౌట్ చేయగలిగినంతగా కథపై ఫోకస్ పెట్టలేదు. కథలో ఎమోషనల్ పాయింట్ ఉన్నప్పటికీ అలాంటి బలమైన సన్నివేశాలు ఒకటి అరా మాత్రమే ఉంటాయి.

పోరాటాలు చేసే నక్సలైట్స్ ని ఈ యువకులు సింపుల్ గా కన్విన్స్ చేయడం లాంటి సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఎమ్మెల్యే ఒక ఊరిని తగలబెట్టాలనుకోవడం.. అది కూడా అమాయకులైన ఆదివాసీలపై కుట్ర పన్నడం సాధారణమైన విషయం కాదు.

అంతటి బలమైన పాయింట్ పెట్టుకుని కథ మొత్తం ల్యాండ్ మైన్ చుట్టూ హాస్యానికి ప్రాధాన్యత ఇస్తూ నడిపించారు. క్లైమాక్స్ అయితే గుంపులో గందరగోళం అన్నట్లుగా ఉంటుంది.

నటీనటులు

ఈ చిత్రానికి ప్రధాన బలం స్నేహితులుగా ప్రధాన పాత్రల్లో నటించిన యువకులు. ఒక్కొక్కరు ఒక్కో డైలాగ్ మాడ్యులేషన్ తో ఫన్ ని చాలా బాగా జనరేట్ చేయగలిగారు. మాటిమాటికి కోపం తెచ్చుకునే రెడ్డి పాత్ర, చర్చి ఫాదర్ కొడుకు పాత్ర ఇలా ప్రతి ఒక్కరి పాత్రని బాగా డిజైన్ చేశారు.

ఐదుగురు స్నేహితులు వీరికి తోడుగా బాబాయ్ పాత్రలని పక్కన పెడితే కథలో మిగిలిన పాత్రలకు ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది. వెబ్ సిరీస్ లో ఫౌల్ లాంగ్వేజ్ కాస్త ఎక్కువైందనే చెప్పాలి. క్లీన్ కామెడీ కోరుకునే వారికి ఈ అంశం ఇబ్బందే.

సాంకేతికంగా

వన్ వర్డ్ తో ఉండే ఫన్ డైలాగ్స్ ఈ వెబ్ సిరీస్ లో బాగా పేలాయి. ఈ డైలాగులకు నటీనటుల మాడ్యులేషన్ తోడు కావడంతో హాస్యం పండింది. అజయ్ అరసడ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం బావుంది.

ఎడిటింగ్ విషయానికి వస్తే చివరి మూడు ఎపిసోడ్స్ లో ల్యాండ్ మైన్ ఇష్యూ ని బాగా సాగదీసినట్లు అనిపించింది. అనవసర సన్నివేశాలకు కోత పెట్టి ఉండవచ్చు.

దర్శకత్వంలో నాని బండ్రెడ్డి మంచి మార్కులు వేయించుకున్నాడు. కాకపోతే కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఈ కథలో ఎమోషనల్ కంటెంట్ పై కూడా దృష్టి పెట్టి ఉంటే ఈ వెబ్ సిరీస్ కు బలం చేకూరేది.

ఫైనల్ పంచ్

కేవలం ఎంటర్టైన్మెంట్ వారికి ఈ వెబ్ సిరీస్ లో నవ్వుకునే ఫన్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ కథని కోరుకునే వారికి మాత్రం యావరేజ్ కంటెంట్ గా అనిపిస్తుంది.

రేటింగ్ : 2.5/5

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.