దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఎత్తివేత

  • IndiaGlitz, [Sunday,May 26 2019]

దేశ వ్యాప్తంగా ఏప్రిల్-11 నుంచి మే-19 వరకు విడతల వారిగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల మే 23న ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఫలితాలు వెల్లడి కావడానికి సుదీర్ఘంగా 42రోజులు పట్టింది. దీంతో ఎన్నికల కోడ్‌ మూడునెలలపాటు కొనసాగింది. కాగా.. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికల నేపథ్యంలో అమలు చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆదివారం సాయంత్రంతో ముగిసింది.

ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లతో పాటు కొన్ని అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్.. ఎన్నికల నియమావళిని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోడ్‌ను ఆదివారం సాయంత్రం నుంచి ఎత్తివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అన్ని రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన కార్యదర్శులకు, చీఫ్‌ ఎలక్ట్రోల్‌ ఆఫీసర్లకు సమాచారం అందించింది. ఇదిలా ఉంటే.. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది. రాష్ట్రమంత్రివర్గ ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జరిగే బదిలీల్లో భాగంగా జిల్లా కూడా ఉద్యోగుల బదిలీలు సాగనున్నట్లు సమాచారం.

More News

30న ‘జగన్ అనే నేను’.. కుంభకోణాలు బయటపెడతా!

ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే-23 సాయంత్రం నుంచి బిజీబిజీగా గడుపుతున్నారు.

తమ్ముడికి జగన్ అంటే ప్రాణం.. నాకు సింహంలా కనిపిస్తారు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్ జగన్ బయోపిక్‌‌కు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఎన్‌.జి.కె ఇంటెన్స్‌తో కూడిన మంచి పొలిటికల్‌ థ్రిల్లర్‌ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, లాంటి సూపర్‌ హిట్‌ మూవీస్‌లో అటు గ్లామరస్‌గా కనిపిస్తూనే

నిజాన్ని ఎవ‌రూ ఆప‌లేరు: రామ్ గోపాల్ వ‌ర్మ‌

రామ్‌గోపాల్‌, ఆగ‌స్త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. ఈ సినిమా మే 31న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విడుద‌ల‌వుతుంది.