రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో షూటింగ్ జ‌రుపుకొంటున్న‌ 'ఎంత మంచివాడ‌వురా'

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్ సంస్థ భారీగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ఎంత మంచివాడ‌వురా'. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాత‌లు. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు. 'శ‌త‌మానం భ‌వ‌తి'తో జాతీయ పుర‌స్కారం అందుకున్న స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మెహ‌రీన్‌ క‌థానాయిక‌.

చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఉమేష్ గుప్తా, చిత్ర స‌మ‌ర్ప‌కులు శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌ మాట్లాడుతూ ''సినిమా చాలా బాగా వ‌స్తోంది. ఆగ‌స్టు 26 నుంచి రాజ‌మండ్రి, పెండ్యాల‌, పురుషోత్త‌మ‌ప‌ట్నం, వంగ‌ల‌పూడి, తొర్రేడు, కొవ్వూరు, కోటిప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నాం. ఈ నెల 25 వ‌ర‌కు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఏక‌ధాటిగా జ‌రుగుతున్న ఈ షెడ్యూల్లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నాం.

హీరో, హీరోయిన్ల‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటున్నారు. తొర్రేడులో రూ.35 ల‌క్ష‌ల వ్య‌యంతో భారీ జాత‌ర సెట్ వేశాం. అక్క‌డ క‌ల్యాణ్‌రామ్‌, న‌టాషా దోషి ('జై సింహా' ఫేమ్‌)పై ఒక సాంగ్ షూట్ చేశాం. ఈ చిత్రీక‌ర‌ణ‌లో 50 మంది డ్యాన్స‌ర్లు, 500 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అలాగే పెండ్యాల‌లోని ఇసుక ర్యాంప‌ల మ‌ధ్య భారీ ఎత్తున తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుంది. వంగ‌ల‌పూడి స‌మీపంలో గోదావ‌రిలో 16 బోట్ల‌తో తెర‌కెక్కించిన ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క్లైమాక్స్ అల్టిమేట్‌గా ఉంటుంది. జ‌న‌వ‌రి 15న సంక్రాంతి కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేస్తాం'' అని అన్నారు.

ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ ''ముందుగా వేసుకున్న‌ ప్ర‌ణాళిక ప్ర‌కారం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లోని అందాల‌ను మా 'ఎంత మంచివాడ‌వురా'లో మ‌రోసారి చూపించ‌బోతున్నాం. అక్టోబ‌ర్ 9 నుంచి 22 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో మూడో షెడ్యూల్ ఉంటుంది. ఆ త‌ర్వాత నాలుగ‌వ షెడ్యూల్లో కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో కొన్ని ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. క‌ల్యాణ్‌రామ్‌గారి చిత్రాల్లో భారీ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది'' అని అన్నారు.

న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని, శ‌ర‌త్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

More News

ఆన్ లైన్లో టికెట్ల కొనుగోలు రద్దు : తలసాని

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాన్ని త్వరలోనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

అవకాశాలు వెతుక్కుంటూ రావు... మనమే సృష్టిం చుకోవాలి: హరీశ్ శంకర్

వరుణ్ తేజ్ హీరో గా నటించిన వాల్మీకి సినిమా టైటిల్ మారినా సూపర్ హిట్ అందుకుంది. కొన్ని పరిణామాలతో  గద్దలకొండ గణేష్ గా థియేటర్లలోకి వచ్చిన సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సెప్టెంబర్ 25న 'రాగల 24 గంటల్లో' టీజర్...అక్టోబర్ 18న విడుదల

వినోదాత్మక చిత్రాలు 'అదిరిందయ్యా చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'యమగోల మళ్ళీ మొదలైంది', 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్'తో నవ్వించి...

హుజూర్ నగర్ ఉపఎన్నికకు మోగిన నగారా.. అక్టోబర్ 21న ఎన్నిక

హుజూర్ నగర్ ఉపఎన్నిక నగారా మోగింది. హుజూర్ నగర్ అసెంబ్టీ స్థానం పోరుకు షెడ్యూల్ విడుదల అయింది.

రేవంత్ వల్ల పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్: కోదండ రెడ్డి

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.