close
Choose your channels

అవకాశాలు వెతుక్కుంటూ రావు... మనమే సృష్టిం చుకోవాలి: హరీశ్ శంకర్

Saturday, September 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అవకాశాలు వెతుక్కుంటూ రావు... మనమే సృష్టిం చుకోవాలి: హరీశ్ శంకర్

వరుణ్ తేజ్ హీరో గా నటించిన వాల్మీకి సినిమా టైటిల్ మారినా సూపర్ హిట్ అందుకుంది. కొన్ని పరిణామాలతో గద్దలకొండ గణేష్ గా థియేటర్లలోకి వచ్చిన సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు హరీశ్ శంకర్... ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే నూతన దర్శకులకు సలహాలు సూచనలు చేశాడు.

సినీ పరిశ్రమలో అవకాశాలు రావు.. మనమే సృష్టించుకోవాలి అన్నారు. వచ్చిన అవకాశం చిన్నదా పెద్దదా అని చూడకుండా... ఎంత వరకు సద్వినియోగం చేసుకున్నాము అన్నదే ముఖ్యం అని తెలిపారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ముందుకు సాగాలని సూచించారు. అంతే కాని మనకు నచ్చిన పని వదిలేసి పక్కకు వెళ్లిపోవడం అంటే... మనల్ని మనం కించపరుచు కోవడమే అన్నారు డైరెక్టర్. మనకు నచ్చిన పనిని ఇతరుల కోసం వదులుకుంటే కాంప్రమైజ్ అంటారు. దానితో అసంతృప్తి మొదలవుతుంది అని... అదే చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళితే మనలో టాలెంట్ బయటపడుతుంది అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.