Family Star:కొత్తగా బ్రేక్‌లు ఇవ్వకున్నా పర్వాలేదు.. 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ వచ్చేసింది..

  • IndiaGlitz, [Thursday,March 28 2024]

రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. తనకు 'గీత గోవిందం' లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. స్వామి నా జీవితంలో కొత్తగా బ్రేక్‌లు ఇవ్వకున్నా పర్వాలేదు.. కానీ ఉన్న దాన్ని మాత్రం చెడగొట్టకు.. అనే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

కుటుంబ విలువలు తెలిపేలా వినోదాత్మకంగా ట్రైలర్‌ ఉంది. డైరెక్టర్ పరశురాం మరోసారి తన ఫ్యామిలీ మార్క్‌ను సినిమాలో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా.. రష్మిక అతిథి పాత్రలో కనిపించనుంది. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాలపై అంచనాలు పెంచేసింది. గోపిసుందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.

ఇదిలా ఉంటే గతంలో విడుదలైన టీజర్లో లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్‌మెంట్ అంటే..? అంటే అని అజయ్‌ ఘోష్‌ అంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్‌లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. అనే డైలాగ్ ఇప్పటికే తెగ పాపులర్ అయింది.

కాగా 2024 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేద్దామనుకున్నారు. కానీ సినిమాలు ఎక్కువగా ఉండటంతో పోటీ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ సినిమాలు ఆశించిన స్థాయిలో సూపర్ హిట్ కాలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' మూవీ పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇక గతేడాది వచ్చిన 'ఖుషీ' సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టలేదు. దీంతో ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా విజయ్‌కు మరో బ్లాక్‌బాస్టర్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

More News

BJP:ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

Kejriwal:లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట

లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.

Chandrababu:60 రోజుల్లో మెగా డీఎస్సీ.. ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగాలు ఇస్తాం: చంద్రబాబు

పరదాల వీరుడు సీఎం జగన్‌తో జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు సూచించారు.

Sadhguru:అనారోగ్యం నుంచి కోలుకున్న సద్గురు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అభిమానులను శుభవార్త.

Anasuya:జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ కీలక వ్యాఖ్యలు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నేతల ప్రచారాలు, విమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి.