ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్ కరోనాతో మృతి

  • IndiaGlitz, [Monday,May 10 2021]

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి(టీఎన్ఆర్) నేడు కరోనాతో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం టీఎన్‌ఆర్‌కు కరోనా సోకడంతో ఆయన హైదరాబాద్ కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కాగా.. తాజాగా ఆయన పల్స్ రేటు బాగా పడిపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్సను అందించారు. కాగా.. వెంటిలేటర్ పై చికిత్స సాగుతోందని, సెమీ కోమా స్థితిలో ఉన్నారని ఆదివారం ఒక న్యూస్ బయటకు వచ్చింది. టీఎన్ఆర్ సన్నిహితుడు శ్రీనివాస్ ఫేస్ బుక్ వేదికగా ఈ విషయం వెల్లడించారు.

టీఎన్ఆర్ దాదాపు కోమా దశలో ఉన్నారని శ్రీనివాస్ తెలిపారు. త్వరగా కోలుకునేలా ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆయన కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందారన్న వార్తతో ఆవేదనకు గురి చేస్తోంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్’ అంటూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా.. టీఎన్ఆర్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా.. గత నెల జర్నలిస్ట్ టీఎన్ఆర్ సోదరికి వైరస్ సోకగా ఆమె చికిత్సతో బయటపడ్డారు. ఆమెకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్న సమయంలో ఆమె కోసం ప్రార్థించాలని టీఎన్ఆర్ ఎంతో ఆవేదనగా కోరారు. కొన్నాళ్లకు ఆమె కోలుకున్న విషయాన్ని అతడు సోషల్ మీడియాల్లోనే వెల్లడించారు.

కాగా.. టీఎన్ఆర్ మృతిపై నేచురల్ స్టార్ నాని ట్విటర్ వేదికగా స్పందించారు. టీఎన్ఆర్ మృతి చెందారన్న వార్త తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఆయన చేసిన కొన్ని ఇంటర్వ్యూలు చూశానని.. అతిథులతో ఆయన మాట్లాడే తీరు ఆకట్టుకుంది. ‘‘టీఎన్ఆర్ గారు కన్నుమూశారన్న వార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయన చేసిన కొన్ని ఇంటర్వ్యూలు చూశారు. ఆయన అతిథులతో మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. ఆయన కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే బలం చేకూరాలని కోరుతున్నా’’ అని నాని ట్వీట్ చేశారు. అలాగే ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

More News

ఆసుపత్రులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

భారత్‌లో కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. లక్షల్లో జనం కొవిడ్ బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రులు సైతం చేతులెత్తేస్తున్నాయి.

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడి‌గా వల్లభనేని అనిల్ ఎన్నిక

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి.

బన్నీకి గ్రీటింగ్ పంపించిన చెర్రీ దంపతులు

కరోనా మహమ్మారి భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంది.

బతుకుతాననే ఆశ లేదంటూ పోస్టు పెట్టిన కాసేపటికే నటుడి మృతి..

కరోనా మహమ్మారి జన జీవితాలను ఎంత విచ్ఛిన్నం చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఎన్నో సంఘటనలను చూస్తూనే ఉన్నాం.

`సింగ‌రాయ్` చిత్రంలోని సాయి ప‌ల్ల‌వి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్

క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో రూపొందుతోన్న నేచుర‌ల్‌స్టార్ నాని `శ్యామ్‌సింగ‌రాయ్` ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి.