‘మోస్ట్  ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’కు ఫ్యాన్సీ ఆఫ‌ర్‌

  • IndiaGlitz, [Tuesday,August 04 2020]

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’. ప్రస్తుతం సినిమా తుది దశ చిత్రీకరణ దశకు చేరుకుంది. నిజానికి ఈ సమ్మ‌ర్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌నేది మేక‌ర్స్ ఆలోచ‌న‌. అయితే వీరి ఆలోచ‌న‌ల‌కు క‌రోనా వైర‌స్ బ్రేకులేసింది. ఇప్పుడు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ సినిమా థియేట్ర‌కిల్ రిలీజ్ కంటే ముందు నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్‌కు మంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’ శాటిలైట్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఆరున్నర కోట్ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకుంద‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చి అఖిల్ మూడు సినిమాలు చేసినా.. ఏ సినిమా కూడా ఆయ‌న‌కు ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వ‌లేదు. దీంతో అఖిల్ త‌న ఆశ‌ల‌న్నీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’పైనే పెట్టుకున్నాడు. మ‌రి ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని ద‌క్కించుకుంటుందో వేచి చూడాలి. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

టెక్నిక‌ల్ ప‌ద్ధ‌తిలో రానా పెళ్లి..!!

టాలీవుడ్ హల్క్ హీరో రానా తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను ఆగ‌స్ట్ 8న పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్జీవీ ‘మ‌ర్డ‌ర్‌’పై నిర్మాత‌ల‌కు కోర్టు నోటీసులు

వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌(ఆర్జీవీ) రూపొందిస్తోన్న చిత్రం ‘మ‌ర్డ‌ర్‌’. మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య ఆధారంగా వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే వ్యాక్సిన్‌ను అందిస్తాం: భారత్ బయోటెక్

వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది.

కమెడియన్ పృధ్వీరాజ్‌కు తీవ్ర అనారోగ్యం.. అర్ధరాత్రి హాస్పిటల్‌కు తరలింపు..

ప్రముఖ హాస్య నటుడు పృధ్వీరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కోవిడ్ లక్షణాలతో ఆయన బాధపడుతున్నప్పటికీ పరీక్షల్లో మాత్రం నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది.

నిన్న సీఎంకు.. నేడు మాజీ సీఎంకు కరోనా పాజిటివ్..

నిన్న కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. నేడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యకు కరోనా సోకింది.