సిటీ సెంటర్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం..

  • IndiaGlitz, [Friday,October 23 2020]

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మహా నగరంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలోని సిటీసెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు రాజుకున్న సమయంలో సిటీ సెంటర్ మాల్‌లో 300 మంది దాకా ఉన్నారు. మొదటగా సిటీ సెంటర్ మాల్‌లోని కింది అంతస్తులో మంటలు రాజుకున్నారు. వెంటనే మాల్‌లో ఉన్నవారందరినీ క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. హుటాహుటిన 20 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేశాయి.

అయితే మంటలను అదుపు చేసే క్రమంలో ఓ ఫైర్ మెన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఫైర్ మెన్‌ను చికిత్స నిమిత్తం ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. కాగా.. మంటలు వ్యాపించిన వెంటనే మాల్ చుట్టుపక్కల ఉన్న భవనాలను ఖాళీ చేయించారు. గురువారం రాత్రి మంటలు వ్యాపించగా.. అవి శుక్రవారం ఉదయం వరకూ మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని ప్రమాదానికి కారణాలైతే తెలియరాలేదు. మంటు రాజుకున్న కింది అంతస్తులో మొబైల్ ఫోన్ల యాక్ససరీలు విక్రయిస్తుంటారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More News

దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన గంటన్నరకే చంపేశారు: ఎస్పీ కోటిరెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌, హత్యకేసును పోలీసులు ఛేదించారు.

శివాత్మికకు ధైర్యం చెప్పిన చిరంజీవి..

శివాత్మిక రాజశేఖర్ ట్వీట్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కోవిడ్‌తో తన తండ్రి పోరాటం కష్టంగా మారిందని..

హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్‌ విడుదల..

హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్‌ను సిటీ న్యూరో సెంటర్ వైద్యులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

వరుస ప్యాన్‌ ఇండియా చిత్రాలతో వరల్‌వైల్డ్‌గా ఇమేజ్‌ పెంచుకుంటోన్న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌

రెబల్‌స్టార్‌ ‌ప్రభాస్‌..ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లోనే కాదు ఎంటైర్‌ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది.

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్, హత్య.. నిందితుల ఎన్‌కౌంటర్?

మహబూబాబాద్‌కు చెందిన ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి.. నాలుగు రోజుల పాటు బాలుడి తల్లిదండ్రులకు, పోలీసులకు చుక్కలు చూపించారు.