ఎక్కడికి కావాలంటే అక్కడికి లాక్కెళ్లవచ్చు.. ఏపీలో మొదటి మొబైల్ థియేటర్, ఎక్కడో తెలుసా..?

  • IndiaGlitz, [Friday,April 15 2022]

అలిసిన మనసుకు ఒత్తిడిని దూరం చేసి.. మూడు గంటల పాటు మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిది సినిమా. ఆధునిక కాలంలో వినోదానికి అసలు సిసిలు చిరునామా సినిమానే. దేశభక్తిని పెంపొందిస్తూ.. జాతీయ సమైక్యతను నిలిపివుంచే సాధనాలలో సినిమా కూడా ఒకటి. చిన్నారుల నుంచి పెద్దల వరకు థియేటర్‌కి సినిమా చూడని వారుండరు. కాలేజీలకు బంకు కొట్టి సినిమాలకు వెళ్లన యువకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలా భారతీయుల రోజు వారి జీవితంలో సినిమా ఒక భాగమైంది.

మారుతున్న కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా సినిమా థియేటర్ కూడా మారిపోయింది. బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమా స్కోప్, 70 ఎంఎం, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ, డీటీఎస్, క్యూబ్ ఇలా రకరకాలుగా రూపాంతరం చెందింది. ఈ కోవలోనే మొబైల్ థియేటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలో మొట్టమొదట 1930లో ‘కోహినూర్ ఒపేరా’ పేరుతో అస్సాంలో మొబైల్ థియేటర్ ను ప్రారంభించారు. దీనిని నాట్యాచార్య బ్రజనాథ్ శర్మ 90 ఏండ్ల కిందనే స్థాపించారు. దీని ద్వారా వేలాది మంది ప్రేక్షకులను ఆకర్షించి నాటకాలను ప్రదర్శించేవారు.

ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌లోనూ మొదటి మొబైల్ సినిమా ధియేటర్ రూపుదిద్దుకుంటోంది. దీనిని ట్రక్కు ద్వారా ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోవచ్చు . ఏపీలో రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటౌతోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్‌లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. ‘పిక్చర్ డిజిటల్స్’ సంస్ధ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిది. ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాతోనే మొదటి ప్రదర్శన ప్రారంభమవుతుందని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.

More News

విజయ్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన రాజమౌళి

కరోనా పరిస్థితులన్నీ చక్కబడటంతో థియేటర్‌లలో సినిమాలు క్యూకడుతున్నాయి.

బిగ్‌బాస్ ఓటీటీ: గాడిలో పడుతోన్న గేమ్.. ఆ కంటెస్టెంట్ ఆటకు జనం ఫిదా, టైటిల్ అతనిదేనా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్నీ...

ఎనిమిదేళ్ల కష్టం... థియేటర్లో ఫొటోలు, వీడియోలు తీయొద్దు : ప్రేక్షకులకు కేజీఎఫ్ టీమ్ రిక్వెస్ట్

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బీస్ట్ విడుదల : విజయ్ ఫ్యాన్స్ వీరంగం .. సినిమా నచ్చలేదంటూ,  స్క్రీన్‌కు నిప్పు

తమిళ అగ్ర కథానాయకుడు , ఇళయ దళపతి విజయ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే.

డ్యాన్సులు, ఫైట్స్‌ల్లో చిరు- చరణ్ జోరు : ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న ‘‘ఆచార్య’’ ట్రైలర్

సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. కెరీర్‌లో పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం..